వారు మన రాష్ట్రానికి వచ్చిన అతిధులు. రాష్ట్ర క్రీడారంగం ఎదగాలి అంటే, ప్రతి చిన్న అవకాశాన్ని, వాడుకోవాలి. గతంలో చంద్రబాబు క్రీడలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో చూసాం. రాష్ట్రంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు పెట్టి, మౌలిక వసతలు పెంచే ఏర్పాట్లు చేసేవారు. అయితే ఇప్పుడు వచ్చిన జగన్ ప్రభుత్వం, అంత కంటే, ఎక్కువగా చెయ్యాలని, క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అందరూ కోరుకుంటున్న వేళ, వస్తున్న వార్తలు చూస్తే, మన రాష్ట్రం పరువు పోతుంది అనే బాధ కలగక మానదు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో, 35వ జాతీయ స్థాయి జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ చాంపిఒన్ షిప్ పోటీలు నిన్న ప్రారంభం అయ్యాయి. దేశం నలు మూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాల చెందిన క్రీడాకారులు, గుంటూరు నాగార్జున యూనివర్సిటీ చేరుకున్నారు. నిన్న రాష్ట్ర క్రీడా మంత్రి అవంతి శ్రీనివాస్, ఈ పోటీలను ప్రారంభించారు. అయితే, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాట్లు పై మాత్రం విమర్శలు వస్తున్నాయి.
నాగార్జున యూనివర్సిటీలో వచ్చిన దగ్గర నుంచి, క్రీడాకారులు, ఇబ్బందులు ఎదుర్కుంటునే ఉన్నారు. కేవలం రిజిస్ట్రేషన్ చెయ్యటానికే, ఉదయం 10 గంటల నుంచి, రాత్రి 8 గంటల వరకు పట్టిందని, వాపోతున్నారు. అంత సేపు లైన్ లో నుంచోటానికి, క్రీడాకారులు ఇబ్బంది పడ్డారు. సరైన ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసారు. కర్ణాటక టీం మాట్లాడుతూ, 60 మంది పడుకోవటానికి, రెండు షీట్లు వేసి పడుకోమన్నారని, భోజనం చెయ్యటానికి ఇబ్బంది పడ్డామని వాపోతున్నారు. అలాగే, గ్రౌండ్ లో ఏర్పాట్లు పై కూడా, క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా బురద మాత్రమే ఉందని, సింథటిక్ ట్రాక్ వద్ద మాత్రమే బాగుందని, కానీసం కూర్చోవటానికి కూడా వసతులు లేవని వాపోతున్నారు.
అయితే, కొంత మంది ఈ పరిణామాల పై విసుగెత్తిపోయి, కేంద్ర క్రీడా మంత్రికి, ప్రధాని మోడీకి, ట్విట్టర్ ద్వారా తాము పడుతున్న ఇబ్బందులు వివరించారు. ఇక్కడ ఏర్పాట్లు అధ్వానంగా ఉన్నాయని, మీరే కలుగచేసుకోవాలని కోరారు. ఇవి కొన్ని ట్వీట్స్... "@KirenRijiju sir, here is how a future of Indian athletes u are trying to create r treated. It’s the scene at #Juniornationalathleticchampionship at Guntur. Athletes are standing here frm 10 am till now to get their registration done. 5 hrs n still gng @PMOIndia" @KirenRijiju sir, ashamed by the way a national athletic event is organised without amenities. Girls don’t even hve washrooms! There is a track & rest of d area is filled wid slush! U must make ur senior most team go to d ground if u want change sports in India" "Junior athletics games are going on in guntur ( andhra parades). There is no meal provide to haryana players . Players are having own food . The accommodation facility is also worst. "