విభజన హామీలు నెరవేర్చండి అయ్యా అంటే, మీకు 10 సంవత్సరాల టైం ఉంది, ఈ లోపే మీకు ఎంతో చేసాం, పండగ చేసుకోండి అంటూ, బీజేపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడటం చూసాం... ఇప్పుడు మన రాష్ట్రానికి కేటాయించిన జాతీయ విద్యాసంస్థల స్థితి చుస్తే, మన రాష్ట్రానికి ఎంత దౌర్భాగ్యమో అర్ధమవుతుంది... సామాన్యంగా నిట్‌, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో, సీట్లు దొరకటం అంటేనే మహా భాగ్యం... వీటిల్లో సీట్లు రావటం కోసం, పోటీ అధికంగా ఉంటుంది... అయితే, మన రాష్ట్రంలో కొత్తగా కేటాయించిన జాతీయ విద్యాసంస్థల్లో సీట్లు మిగిలిపోతున్నాయి... ఎందుకో తెలుసా ? శాశ్వత భవనాలు, ల్యాబ్ లు కొరత వల్ల వీటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు.

bjp 18042018 1

ఐదు విద్యాసంస్థల్లో కర్నూలు ట్రిపుల్‌ఐటీ మినహా మిగతావి తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయి. ప్రైవేటు కళాశాలల భవనాలను అద్దెకు తీసుకుని వీటిని నిర్వహిస్తున్నారు. నిట్‌ తాడేపల్లిగూడెంలో వచ్చే ఏడాది ప్రవేశాలకు భవనాల కొరత ఉంది. నిట్‌, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో 2015-16లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు 2019-20లో మొదటి బ్యాచి కింద బయటకు రానున్నారు. మొదటి స్నాతకోత్సవానికి కూడా శాశ్వత భవనాలు అందుబాటులోకి రావడం లేదు. ఐఐఎం మినహా మిగతా వాటిల్లో ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఐసర్‌లో గతేడాది మాత్రమే వందశాతం భర్తీ అయ్యాయి. నిట్‌లో పదుల సంఖ్యలో సీట్లు మిగులుతున్నాయి. ఐఐటీ తిరుపతిని కృష్ణతేజ విద్యాసంస్థల విద్యా ప్రాంగణంలో నిర్వహిస్తుండగా, ఐసర్‌ను శ్రీరామ ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగిస్తున్నారు.

bjp 18042018 1

ఐఐఎంను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. నిట్‌ను తాడేపల్లిగూడెం సమీపంలోని పెదతాడేపల్లి వద్దనున్న వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహిస్తున్నారు. ఐఐటీ, ఐసర్‌, నిట్‌లకు ప్రహరీ నిర్మాణాలు 75శాతం పూర్తయ్యాయి. పెదతాడేపల్లి వద్దనున్న వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో నిట్‌ను తాత్కాలికంగా ఏర్పాటుచేశారు. ఇక్కడ దాదాపు 32కు పైగా గదులున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.206కోట్లు మంజూరైనా టెండరు దశ దాటలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాసవి కళాశాల యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. భవనాన్ని ఖాళీ చేయాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. ఒక వేళ నిర్మాణం పూర్తయ్యేవరకు కొనసాగించాల్సి వచ్చినా ఇప్పటివరకు కేటాయించిన భవనాలు తప్ప అదనంగా ఇవ్వలేమని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రవేశాలు పొందేవారికి ఎక్కడ తరగతులు నిర్వహించాలన్నది ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిస్థితికి, ఏ బీజేపీ నాయకుడు సమాధానం చెప్తాడు ? వీటితో పండగ చేసుకోమంటారా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read