Sidebar

12
Mon, May

జగన్ మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయంతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుంది. అవగాహన లేకపోవటమే, లేక మొండిగా అనుకున్నది చెయ్యటమో కాని, రాష్ట్రం మాత్రం నష్టపోతుంది. తాజగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. అదే పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉద్యోగాలు కల్పించే బిల్. ఏదైనా పరిశ్రమ పెడితే, దాంట్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలి అనే చట్టం చేసారు. ఇది వినటానికి బాగానే ఉంటుంది కాని, ప్రాక్టికల్ గా మాత్రం అసలు వర్క్ అవుట్ అవ్వదని జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. జగన్ నిర్ణయం పై నిన్న జాతీయ మీడియాలో చర్చ జరిగింది. టైమ్స్ నో ఛానల్ లో జరిగిన చర్చలో, ఈ నిర్ణయం పై అందరూ విస్తుపోయారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రావని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టుబడులు, కొత్త కంపెనీల గురించి మర్చిపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

jobs 247072019 2

ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే మూర్ఖపు పని వల్ల, రేపు హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా, ఇలాంటి రూల్ పెడితే, అక్కడ పని చేసే ఆంధ్రులు ఏమై పోతారని, విశ్లేషకులు అడుగుతున్నారు. ఇలాగే ట్రంప్ ఆలోచిస్తే, అమెరికాలో పని చేస్తున్న లక్షలాది భారతీయుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. సమాజాన్ని చీల్చీ ఇలాంటి నిర్ణయాలు రాజకీయ లబ్ది కోసం తీసుకోవటం మంచి కదాని అన్నారు. మెరిట్ బేసిస్ మీద కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగాలు తీసుకుంటాయి కాని, నువ్వు పలనా ఊరి వాడివా, పలానా కులం వాడివా అని చూసి ఎవరూ ఉద్యోగాలు ఇవ్వరని గుర్తు చేస్తున్నారు. గ్లోబలైజేషన్ అంటే ఏంటో జగన్ మోహన్ రెడ్డికి తెలియదు ఏమో అని అంటున్నారు.

jobs 247072019 3

ఒక పరిశ్రమ వచ్చి పెట్టుబడి పెట్టాలంటే, ఎంతో కష్టపడాలని, ఎన్నో ఇన్సెంటివ్స్ ఇవ్వాలని, అప్పుడు కాని ఒక కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టదని, అలాంటిది ఏమి లేని ఆంధ్రప్రదేశ్ లో, ఇలాంటి ఆంక్షలు పెడితే ఒక్క కంపెనీ కూడా వచ్చి పెట్టుబడి పెట్టదని అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డికి ఇలనాటి ఐడియాలు ఎవరు ఇస్తున్నారో కాని, వారికి సెల్యూట్ చెయ్యాలని అంటున్నారు. కొద్ది రోజుల క్రిందట జరిగిన క్యాబినెట్ సమవేసలో ఐఏఎస్ అధికారి ఉదయ లక్ష్మి కూడా, ఈ విషయం పై వ్యతిరేకత వ్యక్తం చెయ్యగా, జగన్ ఆమె పై అసహనం వ్యక్తం చేసారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా, ఏకి పెడుతుంది. చూద్దాం జగన్ నిర్ణయం సరైనదో, లేక ఈ మేధావులు, విశ్లేషకులు చెప్పేది కరెక్ట్ అనేది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read