పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరుగులు తీయించేలా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు, కాంక్రీటు పనులను ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ‘నవయుగ’కు అప్పగించేందుకు కేంద్రం అంగీకరించిన సంగతి తెలిసిందే... రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పాత ధరలకే (14శాతం మైనస్‌) చేసేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చింది... అయితే, తమను ట్రాన్స్‌స్ర్టాయ్‌కి సబ్‌కాంట్రాక్టర్‌గా కాకుండా, స్వతంత్ర సంస్థగా గుర్తించి... చేసిన పనులకు నేరుగా ప్రభుత్వమే చెల్లింపులు చేయాలని కోరింది... స్వతంత్ర సంస్థగా గుర్తించి, నేరుగా చెల్లింపులు జరిపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి. ట్రాన్‌స్ర్టాయ్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు...

navayuga 31012018 3

నవయుగకు కాంక్రీటు పనులు అప్పగించే ప్రక్రియ వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత ఎలాంటి ఆలస్యం చేయకుండా పనులు చేపడతామని హామీ ఇచ్చింది. రూ. 1400 కోట్ల వ్యయంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులను నవయుగ చేపట్టనుంది... ఈ సందర్భంగా నవయుగ సంస్థ ఎండీ, చింతా శ్రీధర్‌ మాట్లాడుతూ, ‘‘పోలవరం కాంక్రీటు పనుల కోసం ఇరవై వేల మంది కార్మికులను రంగంలోకి దించుతాం. రాత్రీ పగలు పనులు జరుగుతాయి. వచ్చే ఏడాది మార్చి నెల అంటే దాదాపు ఏడాది కాలం ఉంది. అప్పటి లోగా దీన్ని పూర్తి చేస్తాం. గడువులోగా పూర్తి చేస్తే ఇది ప్రపంచ రికార్డు అవుతుంది’’అని కాన్ఫిడెంట్ గా చెప్పారు...

navayuga 31012018 2

నిజానికి ఈ ఇష్యూలో చంద్రబాబు డీల్ చేసిన విధానం, ఒక కేస్ స్టడీగా కూడా తీసుకోవచ్చు... అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు వేసిన అద్భుతమైన ఐడియా ఇది... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా తీసుకున్న నిర్ణయం ఇది... అటు ట్రాన్స్‌స్ట్రాయ్‌ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించేలా చేస్తూ, చంద్రబాబు పోలవరం విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read