వారం రోజులు నుంచి, కేంద్రం మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి... ఉభయ సభల్లో ఎంపీలు ఆందోళన చేసారు... వార్తలు అన్నీ, వీటి చుట్టూతా తిరిగాయి... ఇలాంటి సమయంలో, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది...పోలవరం ప్రాజెక్టు పనుల్లో నవయుగ భాగస్వామి అయింది. శుక్రవారం నవయుగ కంపెనీ డైరెక్టర్ వై.రమేశ్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్పిల్‌వే ప్రాంతంలో పోలవరం ప్రాజెక్ట్ ఎస్‌ఈ వీఎస్ రమేశ్‌బాబుతో కలిసి పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడైన పోలవరాన్ని 2019 నాటికి పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం. అందులో భాగంగా పోలవరం పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు నవయుగకు పనులను అప్పగించారు. ఇప్పటి వరకు చేస్తున్న ట్రాన్స్‌స్ర్టాయ్ యంత్రాలతోపాటు నవయుగ యంత్రాలు, అదనపు సిబ్బంది, కార్మికులు పోలవరం పనుల్లో నిమగ్నం కానున్నారు. పోలవరం ప్రాజెక్టులో పని చేస్తున్న కూలీలు తమకు జీతాలు ఇవ్వలేదంటూ రెండో రోజు ఆందోళన వ్యక్తం చేశారు.
రూ. 1400 కోట్ల వ్యయంతో స్పిల్‌వే, స్పిల్ చానల్ పనులను నవయుగ చేపట్టనుంది... ఈ సందర్భంగా నవయుగ సంస్థ ఎండీ, చింతా శ్రీధర్ మాట్లాడుతూ, ‘‘పోలవరం కాంక్రీటు పనుల కోసం ఇరవై వేల మంది కార్మికులను రంగంలోకి దించుతాం. రాత్రీ పగలు పనులు జరుగుతాయి. వచ్చే ఏడాది మార్చి నెల అంటే దాదాపు ఏడాది కాలం ఉంది. అప్పటి లోగా దీన్ని పూర్తి చేస్తాం. గడువులోగా పూర్తి చేస్తే ఇది ప్రపంచ రికార్డు అవుతుంది’’అని కాన్ఫిడెంట్ గా చెప్పారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా చంద్రబాబు రంగంలోకి దిగి, పోలవరం విషయాన్ని ఒక కొలిక్కి తెచ్చారు...