అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యపై మావోయిస్టుల పేరుతో ఓ లేఖ మంగళవారం సాయంత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కిడారి, సోమలను గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులుగా ఆ లేఖలో విమర్శించారు. ఈ కారణంగానే వారిని ప్రజాకోర్టులో శిక్షించామని పేర్కొన్నారు. ‘‘గూడ క్వారీని వదిలేయాలని చాలాసార్లు కిడారిని హెచ్చరించాం. అయినా, పట్టించుకోలేదు. పైగా బాక్సైట్ తవ్వకాలకు లోపాయికారీగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారు. అందుకే ప్రజాకోర్టులో శిక్షించాం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
వారిద్దరికి రక్షణగా వచ్చిన ఉద్యోగులను మానవతా దృక్పథంతో వదిలిపెట్టామని, ఆయుధాలతో చిక్కినా చంపలేదన్నారు. అలా మావోయిస్టులు దొరికితే పోలీసులు వదిలిపెడతారా అంటూ ప్రశ్నించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఆ లేఖలో తీవ్రంగా హెచ్చరించారు. ‘‘అధికార పార్టీకి తొత్తుగా మారావు. రూ.20 కోట్లకు అమ్ముడుపోయావు. అలాంటి నీవు మాకు నీతులు చెబుతావా? ప్రజాకోర్టు సందర్భంగా నీ గురించీ కిడారి చెప్పారు. నీకు అందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచేసి క్షమాపణ చెప్పాలి. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాలి. లేదంటే, వారికి పట్టిన గతే నీకూ పడుతుంది’ అంటూ ఆ లేఖలో హెచ్చరించారు.
కాగా, ఈ లేఖపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టులు ఎప్పుడైనా, ఏదైనా సమాచారం పంపితే వాడే కాగితాలు గానీ, అందులో ఉపయోగించే భాష గానీ భిన్నంగా ఉంటాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులను ఆరాతీయగా, ‘‘అది మావోయిస్టులు రాసిన లేఖ కాదు. అది ఎవరు రాశారనేది ఆరా తీస్తున్నాం’’ అని వివరించారు. అలాగే ఇప్పటి వరకు, పత్రికలకు, మీడియాకు లేఖలు అందేవి, ఇది వెరైటీగా సోషల్ మీడియాలో తిరగటం ఆశ్చర్యానికి గురి చేసేంది. పార్టీ మారిన ఎమ్మల్యేలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పటం ఇంకా ఆశ్చర్యం. ఇలాంటి భాష సహజంగా జగన్ పార్టీ నేతలు చేస్తూ ఉంటారు. దీంతో ఈ దొంగ లేఖ పై, పోలీసులు విచారణ ప్రారంభించారు. తీగ లాగితే, ఏ పాండులో డొంక కదులుతుందో చూడాలి...