ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్స్ ఆసక్తి రేపుతున్నాయి... కేంద్రం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా కేంద్రంలో ఏ మాత్రం చలనం రాకపోవటంతో, మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి... చంద్రబాబు డైరెక్ట్ గా బీజేపీని ప్రశ్నలు వెయ్యటంతో, త్వరలోనే ఇక ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేస్తారు అనే సంకేతాలు వస్తున్నాయి... ప్రతిపక్ష పార్టీ అయిన జగన్, ఎక్కడ కేంద్రాన్ని నిందించటం లేదు...
ఈ సందర్భంలో చంద్రబాబు డైరెక్ట్ గా రెండు ట్వీట్స్ వేసారు... "కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు. 'సెంటి మెంట్‌కు డబ్బులు రావు' అని. కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు." అంటూ ఒక ట్వీట్ ... అలాగే, "రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు కష్టపడతాం.. రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. ఆ అనుభవం నాకుంది. కష్టపడే తత్వం ప్రజలకుంది. కానీ హక్కుల విషయంలో బీజేపీ అప్పుడో రకంగా ఇప్పుడో రకంగా మాట్లాడుతూ.. న్యాయం చేయాల్సింది పోయి ఎదురు దాడి చేయడం ఎంత వరకు న్యాయమో ఆలోచించుకోవాలి." అంటూ మరో ట్వీట్ వేసారు...
అంతకు ముందు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో సీఎం ప్రసంగించారు... గవర్నర్ తీర్మానానికి సమాధానం చెప్తూ, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు... రాష్ట్ర విభజనలో బీజేపీ భాగస్వామేనని, విభజన చట్టాన్ని అమలుచేయాల్సిన బాధ్యత బీజేపీదేనని అన్నారు. విభజన సెంటిమెంట్‌ను గౌరవించినట్లే ప్రత్యేక హాదా సెంటిమెంట్‌ను కేంద్రం గౌరవించాలని అన్నారు. మీ డబ్బు - మా డబ్బు అంటూ ఉండదని, ఆ డబ్బందా ప్రజలదేనని అన్నారు. దేశానికి దక్షిణాది నుంచే పన్నుల రూపంలో అధిక ఆదాయం వస్తోందని, ఆ డబ్బుతో ఉత్తరాదిని అభివృద్ధి చేసుకుంటున్నారని చంద్రబాబు అన్నారు..