జగన్ బినామీ కంపెనీకి, నేషనల్ కంపెనీ లా టైబ్యనల్ రుణాలు ఎగ్గొట్టినందుకు నోటీసులు జరీ చేసింది... అథెనా ఇన్ఫ్రా సంస్థకు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ అనేది అనుబంధ సంస్థ... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీకాకుళంలో, కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చెయ్యటానికి 2450 ఎకారాలు ఇచ్చారు... ఇక్కడ పవర్ ప్లాంట్ వద్దు అని ఎంత చెప్పినా వినలేదు... ఇప్పుడు ఈ ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్, రుణాలు ఎగ్గొట్టింది అని, దివాలా ప్రక్రియ చేపట్టాలని స్టేట్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది... ఈ అథెనా ఇన్ఫ్రా కంపెనీ పుట్టుక వెనుక చాలా మతలబు ఉన్నట్టు, సిబిఐ అప్పట్లోనే గుర్తించింది... దీని వెనుక అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక మేళ్ళు జరిగాయి అనే ప్రచారం ఉంది... జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీ వెనుక ఉన్నారు అనే వార్తాలు కూడా వచ్చయి... సిక్కింలో జరిగిన పవర్ స్కాంలో కూడా ఈ కంపెనీ ఉంది... వైఎస్ సోదరుడు, వైయస్ రవీంద్రా రెడ్డితో పాటు, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ లుగా ఉండి బయటకు వచ్చారు... తరువాత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు.. తరువాత ఆయన బయటకు వచ్చారు...
అథెనా ఇన్ఫ్రా సంస్థకు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ అనేది అనుబంధ సంస్థ... శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలోని ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ కు మంగళవారం నేషనల్ కంపెనీ లా టైబ్యనల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. "రుణ బకాయిలు చెల్లించకపోవడంతో ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ పై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేర్వేరుగా దరఖాస్తు చేశాయి. వీటిపై మంగళవారం నేషనల్ కంపెనీ లా టైబ్య నల్ జ్యడిషియల్ సభ్యుడు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు.
స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాకు రూ. 952 47 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రూ.1407 కోట్ల చెల్లించలేదని ట్రిబ్యునల్ కు తెలిపాయి... తాము ప్రధాన రుణదాతగా ఉన్నామని, హామీదారుగా ఎథెనా ఎనర్జీ వెంచర్ ఏసియన్ జెన్కో పీటీఈ లిమిటెడ్, ఏఐపీ పవర్ లిమిటెడ్ ఏబీఐఆర్ హైడ్రో పవర్ అబిర్ ఇన్ఫ్రా, కోబాల్డ్ పవర్ లిమిటెడ్ తదితర కంపెనీలున్నాయన్నారు. వెయ్యి ఎకరాల దాకా భూమిని హామీగా చూపినట్లు పేర్కొన్నారు. వాదనలను విన్న సభ్యులు రాజేశ్వరరావు ఈస్ట్ కోస్ట్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసూ తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు...