మాట్లాడితే మావాడు స్వాతి ముత్యం... మా వాడు అవినీతి మీద పోరాటం చేస్తుంటే, దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ భయం వేసి, సోనియా గాంధీతో మాట్లాడి, జగన్ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు.... ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వలేదు అంటారుగా... ఇది చూడండి మీ వాడి భాగోతం... దొంగ లెక్కలు రాశాడు అని, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చి, చర్యలు తీసుకొమంది... తప్పు చేశాడు అని చెప్పెంది... జగన్ పబ్లికేషన్స్ అంతా దొంగ సొత్తు, దొంగ లెక్కలు అని మరోసారి రుజువైంది... సిబిఐ, ఈడీ ఇప్పటికే జగతిలో పెట్టిన పెట్టుబడులు అన్నీ దొంగ పెట్టుబడులే అని తేల్చాయి కూడా...
వివరాల్లోకి వెళ్తే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, జగతి పబ్లికేషన్ సమర్పించిన బ్యాలన్స్ షీట్లలో తప్పులు ఉన్నాయని, తప్పుడు లెక్కలు చూపించారు అని చెప్పెంది... ఇది 2006-2007 నుంచి 2012-2013 దాకా బ్యాలన్స్ షీట్లలో తప్పుడు లెక్కలు చూపించారని తేల్చింది... అంటే సిబిఐ కేసు ఫైల్ అయ్యేదాకా తప్పుడు లెక్కలు చూపిస్తూనే ఉన్నారు... కంపెనీస్ ఆక్ట్ 1956 ఉల్లంఘన జరిగింది అని తేల్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్... 2013 వరకు జగన్ కూడా జగతిలో డైరెక్టర్ గా ఉన్నాడు... అందుకే జగన్ తో పాటు, అందరి డైరెక్టర్ ల మీద నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసేంది...
జూన్ 5 2017 తేదిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్, వీరు దొంగ లెక్కలు చూపించారని ఆర్డర్ ఇచి, రిజిస్టారార్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ కు వారి మీద ఆక్షన్ తీసుకొమంది... ఆ ఆర్డర్ ఇక్కడ చూడవచ్చు... http://nclt.gov.in/Publication/Hyderabad_Bench/2017/Others/JellaJaganN.pdf ... మళ్ళీ ఏమైందో ఏమో, బహుసా వీళ్ళు అప్పీల్ చేసి ఉంటారు...జూన్ 9 2017 తేదిన మరో ఆర్డర్ ఇచ్చింది... ఇంకో సారి తప్పు చెయ్యద్దు అని , అందరి డైరెక్టర్ లకు, 50 వేలు ఫైన్ వేసింది... http://nclt.gov.in/Publication/hyderabad_Bench/2017/Others/24.pdf ... మరి ఈ వార్తా మీడియాలో రాకుండా ఎవరు తొక్కిపెట్టారో తెలీదు... నా మీద ఏ కేసు లేదు, నేను స్వాతిముత్యం అని చెప్పే జగన్, తన కంపనీలో దొంగ లెక్కలు రాసినందుకు, National Company Law Tribunal కంపెనీస్ ఆక్ట్ 1956 ఉల్లంఘన జరిగింది అని ఎందుకు శిక్ష వెయ్యమంది, తరువాత ఫైన్ వేసిందో చెప్పాలి... తన పాదయాత్రలో ఇది స్పష్టం చెయ్యాలి...