అనుకున్నదే అయ్యింది... కెసిఆర్ తో కలిసి డ్రామాలు ఆడుతున్న, 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు రెండో రోజు కూడా పారిపోయింది... అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం, దేశంలో అన్ని విపక్షాలని ఏకం చేసింది... స్పీకర్ అవిశ్వాసం చదివే అప్పుడు, అందరూ తమ స్థానాల్లో నుంచునున్నారు... కాని డ్రామా ప్రకారం, కెసిఆర్ ఎంపీలు, అన్నాడీఏంకే ఎంపీలు వెల్ లో , గోల గోల చేసారు... దీంతో సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను రేపటికి వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలంటూ కోరారు.
కానీ, కావేరీ అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్ల అంశంపై తెరాస సభ్యులు వెల్‌లోకి వెళ్లి తమ ఆందోళన కొనసాగించారు. ఈ నేపథ్యంలో సభ్యుల నిరసనల మధ్య లెక్కింపు సాధ్యం కాదంటూ లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. అవిశ్వాసాని భయం లేదంటూనే, బీజేపీ ఇలా డ్రామాలు ఆడిస్తుంది అని, విపక్షలాన్నీ అంటున్నాయి... కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని, సాటి తెలుగు వాడికి సాయం చెయ్యలేని వాడు, దేశాన్ని ఉద్దరిస్తాడా అంటూ, ఎద్దేవా చేస్తున్నాయి...
అటు రాజ్యసభలోనూ ఇవే ఆందోళనలు కొనసాగాయి. వివిధ అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేయడంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో 56 అంగుళాల ఛాతీ, ఆంధ్రోడి దెబ్బకు పారిపోయింది అంటూ, ఎద్దేవా చేస్తున్నారు ప్రతిపక్షాలు... అలాగే నేను మద్దతు తెస్తాను అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడని, చెల్లలు కవితకు చెప్పి, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు...