చంద్రబాబు మాత్రమే వెళ్లారు.. చాలా మంది ఉన్నారు.. అంటూ అమిత్ షా చెప్పిన వారం రోజులుకే, ఎన్డీఏనుంచి బయటకు వచ్చేస్తాం అంటున్నాయి మిత్ర పక్షాలు.. మోడీ, అమిత్ షా నిర్వాకాల వల్ల, రోజు రోజుకీ బీజేపీ దిగజారిపోతుంది. మోడీ, అమిత్ షా చేస్తున్న పనుల వల్ల, వచ్చే ప్రజా వ్యతిరేకత తమకు తగులుతుంది అని భయపడుతున్నారు. అవే ఎన్నికల ఫలితాల్లో కూడా కనిపిస్తున్నాయి. గతంలో మనుగడ కోసం బీజేపీ చేతిలో అవమానాలను దిగమింగుకున్న పార్టీలు ఇప్పుడు తమను గెలిపించలేని బీజేపీ దగ్గర ఊడిగం అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాయి. మిత్రధర్మం ఇదేనా అంటూ కొన్ని సూటిపోటి మాటలు విసురుతుంటే, మరికొన్ని మాకేదీ గౌరవం అంటున్నాయి . ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి కూటమిలో అభిప్రాయభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

modi shah 02062018 2

2014 ఎన్నికల అనంతరం మధ్యలో ఎన్డీఏలో చేరిన జేడీయూ ఇప్పుడు బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల దాకా బీజేపీతోనే కూర్చుంటే రాజకీయ పార్టీగా అంతర్థానం అయిపోతామనే భయం మొదలైంది. 2014 ఎన్నికల్లో బిహార్‌లో మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ 31 గెలుచుకుంది. జేడీయూ రెండుచోట్లే నెగ్గింది. 2019లో బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే 2014లో గెలిచిన రెండు సీట్ల లెక్కన తమకు తక్కువ సీట్లు కేటాయిస్తుందేమోనన్న భయం జేడీయూని వెంటాడుతోంది. దీన్ని నివారించేందుకే ముఖ్యమంత్రి నితీశ్‌ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు.

modi shah 02062018 3

మహారాష్ట్రలో పాల్ఘార్‌లో తొలిసారిగా దీర్ఘకాల మిత్రపక్షాలైన బీజేపీ- శివసేన ఢీకొన్నాయి. బీజేపీ చేతిలో శివసేన ఓడిపోయింది. మహారాష్ట్రలో మేమే పెద్ద పార్టీ అంటూ బీజేపీ కాలరెగరేస్తోంది. శివసేన గాయాలకు కారం రాస్తోంది. బీజేపీ ఎలక్షన్‌ కమిషన్‌తో కుమ్మక్కైందనీ, ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే ఓడిపోయామనీ శివసేన వ్యాఖ్యానించింది. కాంగ్రె్‌సకు లాభం చేకూర్చే ఏ పనీ ఉద్ధవ్‌ చేయరనే ధీమా బీజేపీని ఎంతకైనా తెగించేట్లు చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో తమకు ఆశించిన స్థాయిలో పదవులు అందలేదని, ఏ కీలక నిర్ణయం తీసుకున్నా తమను సంప్రదించడం లేదని అకాలీదళ్‌ అసంతృప్తిగా ఉంది. కశ్మీర్‌లోనూ కఠువా ఉదంతం తర్వాత తెగతెంపుల వరకు వెళ్లింది. రాంమాధవ్‌ ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించడంతో ప్రస్తుతానికి రాజీ కుదిరింది. బీజేపీకి, ఎల్జేపీకి మధ్య అంతరం పెరిగింది. ఇక బీజేపీకి చివరకు మిగిలేది, ఆంధ్రాలో జనసేన, వైసిపీ, తమిళనాడులో అన్నాడీఎంకే మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read