సరిగ్గా నెల రోజుల క్రితం వరకు అభ్యర్థుల విషయంలో గందరగోళం, గెలుపు అవకాశాలపై సంశయంల మధ్య ఊగిసలాడిన జిల్లా తెలుగుదేశం ప్రభుత్వ కొత్త సంక్షేమ పథకాలతో ఊపిరి తీసుకొని, కొత్త శక్తుల సమీకరణలతో ఉత్సాహం కనిపిస్తోంది. అభ్యర్థుల విషయంలో ఒక్కో నియోజకవర్గంగా క్లారిటీ రావడం, కొత్త నేతలు పార్టీలో చేరే అవకాశాలు మెరుగుపడటం.. ఆశావహులు, అసంతృప్తుల సర్దుబాటుకు అధిష్ఠానం నేరుగా రంగంలోకి దిగడంతో తెలుగుదేశం ముఖచిత్రం మారుతోంది. పార్టీ అభిమానుల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. మొన్నటి వరకు దయనీయస్థితిలో ఉన్న నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో సీన్‌ మారిపోయింది. టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి పేరు ప్రకటించగానే ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఊపు కనిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి తిరుగులేదనుకున్న జనం ఆదాల పేరు ప్రకటనతో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు.

nellore 24022019

మరోవైపు ఎన్నికల వ్యూహరచనలో భాగంగా మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మద్దతు కూడగట్టుకున్నారు. రూరల్‌ నియోజకవర్గంలో బలమైన వర్గం కలిగిన మంత్రి సోమిరెడ్డిని కలిసి సాయం కోరారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన ద్వితీయశ్రేణి నాయకులను ఆదాల తన వైపు తిప్పుకునే పనిని ప్రారంభించారు. కొద్ది రోజులుగా రెండు మూడు వర్గాలకు చెందిన నాయకులకు టీడీపీలోకి ఆహ్వానిస్తూ కండువాలు కప్పుతున్నారు. నగరానికి చెందిన కొంతమంది నాయకులకు పదవులు ఇవ్వడంతో అసంతృప్తి జ్వాల చల్లార్చినట్టు అయ్యింది. మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు ఎన్నికలలోపే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో అజీజ్‌తోపాటు ముస్లిం మైనారిటీ వర్గాల్లో సైతం ఉత్సాహం కనిపిస్తోంది. ఇక బీసీ వర్గానికి చెందిన జడ్‌.శివప్రసాద్‌, రెడ్డి సామాజికవర్గం నుంచి అనురాధకు కార్పొరేషన్‌ చైర్మన్ల హోదాలో రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు ఇచ్చారు. నగరంలో వేల కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనుల తాలూకు ప్రభావానికి తోడు ముఖ్య నాయకులను సంతృప్తి పరచడం ద్వారా నగర టీడీపీలో నూతనోత్సహం కనిపిస్తోంది.

nellore 24022019

సూళ్లూరుపేటలో వేనాటి.. టీడీపీకి కంచుకోట వంటి ఈ నియోజకవర్గం స్థానిక నాయకుల అసంతృప్తుల కారణంగా నీరసించిపోయింది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులకు ఇస్తున్న విలువ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తమకు ఇవ్వడం లేదని పలువురు నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యారు. సీనియర్‌ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డికి టీటీడీ ట్రస్ట్‌ బోర్డు పదవి ఇవ్వడంతో ఆ పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కొత్తశక్తులను కూడగట్టుకునే పనిలో పడ్డారు. కలువాయి మండలం దాచూరు మత్స్యకార సొసైటీకి ఎన్నికలు నిర్వహించి టీడీపీ వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించుకున్నారు. రాపూరు మండలానికి చెందిన పాపకన్ను మధురెడ్డికి కురుగొండ్లకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో వీరిద్దరి మధ్య సంధి కుదిరినట్లు సమాచారం. రాపూరు అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా మధురెడ్డిని నియమించడానికి రంగం సిద్ధమైంది. పెంచలకోన ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి నియమించడానికి పావులు కదుపుతున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read