నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని చోట్ల జరుగుతున్నట్టే ఇక్కడ కూడా, అధికారాన్ని అడ్డు పెట్టుకుని, టిడిపిని ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ నేతలు. నెల్లూరు కార్పొరేషన్ 4వ డివిజన్ అభ్యర్థి భర్త మామిడాల మధుని పోలీసులు అరెస్టు చేసారు. నిన్న అర్ధరాత్రి మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, నవాబ్‍పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. జేబులో రూ.2 వేలు ఉన్నాయనే కారణం చెప్పి, నిర్బంధించారని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆందోళన చేస్తున్నాయి. అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోలీసుల తీరుకు నిరసనగా, నిన్న అర్ధరాత్రి నుంచి పోలీసు స్టేషన్ ఆవరణలో కోటంరెడ్డి బైఠాయించారు. తమ పార్టీకి చెందిన మధును అకారణంగా అరెస్ట్ చేసారని, విడుదల చేయాలని ఆందోళన కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చేస్తున్నారు. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇది మంచి పధ్ధతి కాదని కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పోలీసుల తీరుకి నిరసన తెలుపుతున్నారు.
నెల్లూరులో టిడిపి అభ్యర్ధి భర్త అరెస్ట్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..
Advertisements