తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. డిసెంబర్ 28వ తారీఖున కందుకూరులో, 29న కావలిలో, 30వ తారీఖున కోవూరు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. "ఇదేం ఖర్మ-రాష్ట్రానికి"అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని పార్టీనేతలు చెబుతున్నారు. ఈ సంభందిత ప్రాంతాల్లో జరిగే రోడ్‌షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. అంతే కాకుండా ఈ మూడు రోజులు చంద్రబాబు ఉదయం వివిధ వర్గాలతో సమావేశం అవుతారని టిడిపి నేతలు స్పష్టం చేసారు. కర్నూల్ , గోదావరి జిల్లాల్లో, చంద్రబాబు టూర్ సూపర్ సక్సస్ కావడంతో ,టిడిపి మరింత జోష్ తో నెల్లూరు పర్యటనకు సిద్దం అవుతుంది.
Advertisements