సామాన్యంగా సాక్షి మీడియా అంటే, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. సాక్షి అవినీతితో పెట్టింది అని, దానికి జర్నలిజం విలువలు లేవని, కోర్టు కేసుల్లో ఉన్న సాక్షి, ఎదుటి వారి పై బురద చల్లటానికి మాత్రమే ఉపయోగిస్తారని, తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉంటారు. అయితే నెల్లూరు తెలుగుదేశం నేత, సాక్షి అధినేత జగన్ మోహన్ రెడ్డి భార్య, వైఎస్ భారతికి ధన్యవాదాలు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగు, తెలుగుదేశం, వైసీపీ మధ్య ధాన్యం కొనుగోళ్ళ విషయంలో మాటల యుద్ధం నడుస్తుంది. దీంతో రెండు పార్టీల నేతల మధ్య ప్రతి రోజు, విమర్శలు నడుస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు, నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ళలో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని, వారు కోట్లు వెనకేసుకుంటున్నారని, రైతులు నష్టపోతున్నారని వాపోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలకు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ళలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, తెలుగుదేశం హయంలోనే జరిగాయని, తమ పాలన అంతా ట్రాన్స్ పేరెంట్ గా ఉందని, తెలుగుదేశం నేతలు కావాలనే తమ పై బురద చల్లుతూ, రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారని వాపోయారు.

అయితే తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలకు బలం చేకూరుస్తూ, వైసిపీ సొంత పత్రిక సాక్షి నెల్లూరు ఎడిషన్ లోనే, ధాన్యం కొనుగోళ్ళలో భారీ అక్రమాలు జరిగాయి అంటూ వార్త వచ్చింది అంటూ, వా వార్త చూపిస్తూ తెలుగుదేశం నేతలు మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం నేత ఆనం వెంకట రమణారెడ్డి మీడియా ముందుకు వచ్చి, ఆ కధనం చూపిస్తూ, జరిగిన అక్రమాల పై మేము చెప్పింది నిజం అయ్యింది అంటూ, మీ పత్రికే రాసింది అంటూ, ఇన్నాళ్ళు దీని పై మా మీద విమర్శలు చేసిన వారు ఏమి సమాధానం చెప్తారు అంటూ, ఎదురు దాడి చేసారు. ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈ స్కాంలో ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ అక్రమాలు జరిగాయని, దానికి సాక్షి పత్రిక కధనమే నిదర్శనం అని, ఏ స్థాయిలో అక్రమాలు జరగకపోతే, సొంత పత్రికే రాస్తుంది అంటూ, ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సాక్షి పత్రికలో మొదటి సారి ఒక నిజం చూస్తున్నానని, ఈ వార్త సాక్షిలో వేసినందుకు వైఎస్ భారతి గారికి ధన్యవాదాలు అంటూ, ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read