అధికారంలో లేకపోతేనే ఈ వైసీపీ నాయకులని ఆపలేకపోతున్నాం, పొరపాటున అధికారంలోకి వస్తే, వీళ్ళు చేసే అరాచకాలకు హద్దే ఉండదేమో. అక్కడ ఎమ్మల్యే అనిల్ కుమార్ ఎలాంటి వాడో అందరికీ తెలిసిందే. అతన్ని చూసుకుని, ఈ అనుచరగణం రెచ్చిపోతుంది. మూడు రోజుల క్రితం ఓ టీచర్ పై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో వైసీపీకి చెందిన ఓ కార్పొరేటర్‌కు అయిదేళ్లు జైలు శిక్ష పడిన విషయం మర్చిపోక ముందే, ఇప్పుడు వైసీపీకి చెందిన మరో కార్పొరేటర్ టూరిజం హోటల్లో బీభత్సవం సృష్టించాడు. ఏకంగా హోటల్ రిసెప్షనిస్టు పై తప్ప తాగి దాడి చేసి గాయపరిచారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, వైసీపీ పార్టీకి చెందిన కార్పొరేటర్ రాజశేఖర్ శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కొండాయపాళెం గేటు సమీపంలో ఉన్న ఏపీ టూరిజం హరిత హోటల్‌లో ఇద్దరు ఉంటామని చెప్పి 318 నంబరు గల గదిని తీసుకున్నారు. గదిని అద్దెకు తీసుకునే సమయంలో హోటల్ సిబ్బందికి ఇవ్వాల్సిన గుర్తింపు కార్డులు మళ్లీ ఇస్తామని చెప్పడంతో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హోటల్ రిసెప్షనిస్టు అయిన షేక్ షాకీర్ కార్పొరేటర్ ఉన్న గదికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో గదిలో ఎనిమిది మంది ఉండటంతో అంతమంది ఉండేందుకు టూరిజం అధికారులు ఒప్పుకోరని కార్పొరేటర్‌కు తెలియజేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కార్పొరేటర్ రాజశేఖర్ రిసెప్షనిస్టు షాకీర్‌ను హోటల్ పైఅంతస్తు నుంచి కొట్టుకుంటూ కిందకు తీసుకువచ్చాడు.
కార్పొరేటర్ అయిన తనకే ఎదురు చెబుతావా అంటూ దుర్భాషలాడుతూ రిసెప్షన్ కేంద్రం వద్ద ఉన్న నోటీసు బోర్డును తీసుకుని అతనిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో షాకీర్ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, ఎస్సై పూర్ణచంద్ర రావు హోటల్‌కు చేరుకుని దాడికి సంబంధించిన వివరాలను సేకరించారు. శనివారం కూడా పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. హోటల్‌లో ఉన్న సీసీ కెమేరా ఫుటేజీలను పరిశీలించగా, అందులో పూర్తి సమాచారం కనపడింది. కార్పొరేటర్ రాజశేఖర్, తేజ, మరో ఆరుగురు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్గామిట్ట ఎస్సై పూర్ణచంద్ర రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.