జడ్జి మారినా, జస్టిస్ మారదని ఒక నానుడి ఉంది. మనం చేసే పనులు చట్ట వ్యతిరేకంగా ఉంటే, ఏ జడ్జి అయినా ఒకే రకమైన తీర్పు ఇస్తారు. కాకపోతే ఆ జడ్జిలు వాడే పదాల్లో తేడా ఉంటుంది ఏమో కానీ, జస్టిస్ లో తేడా ఉండదు. ఎందుకు అంటే, ఎవరు అయినా సరే చట్టం, న్యాయం ప్రకరామే తీర్పులు ఇస్తారు. మన రాష్ట్రంలో వైసీపీ పార్టీలాగా కొంత మంది, తమ అసమర్ధతను, చేతకాని తనాన్ని, జడ్జిల మీద తోసేసి కాలం గడుపుతూ ఉంటారు. ప్రజలలో జడ్జిలు, కొన్న పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయి అనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. ఏ జడ్జి అయినా, చట్టానికి లోబడే తీర్పులు ఇస్తారు. మన రాష్ట్ర హైకోర్టుకు ఈ మధ్యనే కొత్త చీఫ్ జస్టిస్ వచ్చారు. ఆయనే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర. వచ్చి వారం రోజులు కూడా కాలేదు కానీ, ఆయన ఎంత టఫ్ అనేది ఇప్పటికే ఆయన కేసులు డీల్ చేస్తున్న విధానం చూస్తే అర్ధం అవుతుంది. గతంలో జస్టిస్ కేకే మహేశ్వరి, జస్టిస్ అనుప్ కుమార్ గోస్వామి చీఫ్ జస్టిస్ లుగా చేసారు. వారికి మించి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర టఫ్ గా ఉన్నారు. ప్రధానంగా గత ఏడాది కాలంగా సాగుతున్న సిబిఐ కేసు విషయంలో, అసలు కుట్ర ఏమిటో బయట పెట్టే విధంగా, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర వ్యవహరిస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది.
జడ్జిల పై, న్యాయస్థానాల పై కామెంట్స్ చేసిన వారి కేసులో, సిబిఐ గత ఏడాది కాలంగా సాగదీస్తూ వస్తుంది. మొత్తం 90 మంది ఉంటే, ఏదో ఒక పది మందిని చిన్న చిన్న వాళ్ళని అరెస్ట్ చూపించి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ ప్రజా ప్రతినిధుల జోలికి సిబిఐ వెళ్ళలేదు. ముఖ్యంగా వెళ్ళు అందరూ టీవీల్లో కామెంట్స్ చేసారు. జడ్జీలు, చంద్రబాబు ఫోన్లు చూడాలి అని మాట్లాడిన వారిని కూడా సిబిఐ టచ్ చేయలేదు. ఇక పంచ్ ప్రభాకర్ అనే వాడిని కూడా ఇప్పటికీ పట్టుకోలేదు. దీని పై చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర సీరియస్ అయ్యారు. అతన్ని ఎందుకు పట్టుకోలేక పోతున్నారని ? నోటీస్ ఇచ్చి రమ్మంటే వస్తారా అని ప్రశ్నించారు. అంతే కాదు, ఇప్పటికీ పోస్టింగ్ లు ఎందుకు వస్తున్నాయి అని, సిబిఐ తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఏపి మా స్వరాష్ట్రం అని, న్యాయ వ్యవస్థ పై చేస్తున్న దా-డి, ఏపి రాష్ట్రం మీద చేస్తున్న దా-డిగా చూస్తున్నాం అని అన్నారు. మేము వీధుల్లోకి వచ్చి పోట్లాడటలేం కదా అని ప్రశ్నించారు. మొత్తానికి చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, సిబిఐని గడగడలాడిస్తున్నారు. కుట్ర మొత్తం తేల్చే దాకా వదిలి పెట్టేలా లేరు.