జగన్ మోహన్ రెడ్డి కలలు కంటున్న ఏది ముందుకు వెళ్ళటం లేదు. మూడు రాజధానులు అని చెప్పి రెండేళ్ళు అయినా, ఇప్పటికీ ఒక్క అడుగు కూడా పడలేదు. ఇక జిల్లాల విభజన అంటూ, మరో పెద్ద టాస్క్ తీసుకున్నారు. ఇప్పుడు దీనికి కేంద్రం బ్రేకులు వేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాను అంటూ, జగన్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే దీని పై కసరత్తు కూడా ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీ స్థాయిలోనూ, జిల్లా కలెక్టర్ స్థాయిలోనూ వేరు వేరుగా కమిటీలు వేసారు. ఈ కమిటీలు కూడా తమ ప్రక్రియను ప్రారంభించారు. తొందర్లోనే జిల్లాల విభజన అంటూ, లీకులు ఇస్తూ వచ్చారు. అయితే ఎన్నికలు కూడా అయిపోవటంతో, ఇక ఈ జిల్లాల ప్రక్రయ ఊపందుకుంటుందని, ఉగాదికి కొత్త జిల్లాలు వచ్చేస్తాయని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీనికి ఇప్పుడు కేంద్రం బ్రేకులు వేసింది. జనాభా లెక్కలు దీనికి సాకుగా చూపిస్తుంది. 2021 జనాభా లెక్కలు అయ్యేంత వరకు, జిల్లాల విభాజన కుదరదు అని తేల్చి చెప్పింది. మండల, జిల్లా, గ్రామ రెవిన్యూ పరిధిలో ఎక్కడా ఏమి చెయకూడదని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. అయితే గతంలో ఇచ్చిన ఆదేశాలు, ఇప్పటికీ అమలులో ఉన్నాయని, కొత్తగా ఏమి చేయకూడదు అని స్పష్టం చేసింది.

districts 29032021 2

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిన ఒక ఆర్టీఐ ధరఖాస్తులో భాగంగా కేంద్రం మళ్ళీ ఇప్పుడు, ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు, జిల్లాల విభజన ప్రక్రియ, ఎన్నికలు అయిపోగానే మొదలు పెట్టి, ఉగాదికి కొత్త జిల్లాల ప్రకటన ఉంటుందని, అందరూ భావించారు. అయితే, క-రో-నా కారణంగా జనగణ లేట్ అవుతూ వస్తుంది. కేంద్రం మళ్ళీ ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రరంభిస్తుందో తెలియదు. అలాగే ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కేసులు పెరుగుతూ ఉండటంతో, ఇది ఎప్పటికి అవుతుందో తెలియదు. మరో పక్క కేంద్రం ఏమో, అది అయ్యే దాకా, జిల్లాల విభజన కుదరదు అని తేల్చి చెప్పింది. ప్రతి 10 ఏళ్ళకు జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇది గత ఏడాది అవ్వాల్సి ఉండగా, క-రో-నా తో మొత్తం తారుమారు అయ్యింది. మాములుగా ఈ జనాభా లెక్కల ప్రక్రియ ఏడాది పాటు కొనసాగుతుంది. అయితే, ఇది ఎప్పుడు మొదలు అవుతుందో తెలియదు. జనాభా లెక్కల ప్రక్రియ మొదలైతే ఏడాది పాటు కొనసాగుతుంది, అప్పటి వరకు జిల్లాల విభజన ఏర్పాటు అయ్యే అవకాసం ఉండదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read