ఒక సమస్యకు పరిష్కారం, మరో సమస్యను సృష్టించిటమే అని వైసిపీ ప్రభుత్వం భావిస్తుంది. నిజానికి ఇది వైసిపీ ప్రభుత్వం వ్యూహం అని, వారి పరిపాలన స్టైల్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, దాన్ని ఎలా పరిష్కరించాలి అని మాత్రం వైసిపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్ కు ఉండదు. నా నిర్ణయమే ఫైనల్, ఏమి చేస్తారో చేసుకోండి అని అహంకారం కనిపిస్తుంది. ఆ సమస్య ప్రజలు మర్చిపోవాలి అంటే, వేరే సమస్యతో ముందుకు వస్తే, సరిపోతుందని జగన్ మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటారు. మొన్నటి వరకు రాష్ట్రంలో ఉన్న హాట్ టాపిక్ సినిమా టికెట్ల వ్యవహారం. దాని చుట్టూ వార్తలు తిరుగుతున్న సమయంలో, ఉద్యోగుల పీఆర్సి అంశం తెర పైకి వచ్చింది. సినిమా టికెట్ల కంటే ముందు అధ్వానమైన రోడ్డుల గురించి, అలాగే ఓటిఎస్ గురించి, కరెంటు చార్జీల పెంపు గురించి, పెట్రోల్ బాదుడు గురించి, ఇలా ఒక సమస్య తరువాత మరో సమస్య వచ్చింది. అంతే కాని ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. ప్రస్తుతం ఉద్యోగులు , ప్రభుత్వం పై ఎదురు తిరిగారు. మరో వారం పది రోజుల్లో సమ్మెకు కూడా వెళ్తున్నారు. తమకు రెండు చేతులా ఓట్లు వేసిన ఉద్యోగులనే జగన్ మోహన్ రెడ్డి ముంచేశారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలని ప్రభుత్వం భావిస్తుంది.
సరిగ్గా ఇదే టైంలో క్యాసినో వ్యవహారం గందరగోళం చేసి పడేసింది. దీంతో రాజకీయం మొత్తం దీని చుట్టూ తిరుగుతున్న సమయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఈ సమస్యల నుంచి డైవర్ట్ చేయటానికి, అద్భుతమైన ప్లాన్ వేసారు. అదే కొత్త జిల్లాల వ్యవహారం. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. నిజానికి దేశ స్థాయిలో జన గణన అయ్యే దాకా, ఇది చేపట్ట కూడదని కేంద్రం చెప్పినా, ప్రస్తుతం ప్రజలను ఇప్పుడు ఉన్న సమస్యల పై , దృష్టి మళ్ళించాలి అంటే, ఇదే కరెక్ట్ అని వైసిపీ భావించింది. అందుకే సడన్ గా ఇది నిన్న సాయంత్రం తెర మీదకు తెచ్చారు. వెంటనే రెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇది ఇంపాక్ట్ అవుతుంది. మ్మమ్మల్ని ఈ జిల్లాలో కలపాలని, లేదా మా జిల్లాకు ఈ పేరు పెట్టాలని, ఇలా రకరకాలుగా ప్రజలు మళ్ళీ ఆందోళన పడతారు. ఇప్పుడున్న సమస్యలు అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. అందుకే వైసిపీ ఇప్పుడున్న సమస్యల నుంచి బయట పడటానికి, మరో సమస్యని సృష్టించే పనిలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.