ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏపి లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరిస్తుంది. ఈ 26 జిల్లాలకు సంభందించి కలక్టర్ ఆఫీసులు, ఎస్పి కార్యాలయాలు కూడా ఏర్పాటు చేసారు. ఈ జిల్లాలకు అధికారులను కూడా నియమించేసారు.. అయితే రాష్ట్రం లో ఇంత పెద్ద ఎత్తున జిల్లాల విభజన కార్యక్రమం జరుగుతుంటే కనీసం ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం కూడా అందలేదు. ఎక్కడ చూసినా వైసిపి నేతల హడావిడే కనిపిస్తుంది కాని ఏ ఒక్క జిల్లాలో కూడా ప్రతిపక్ష నేతలు కనిపించలేదు. దీని పై వారు స్పందిస్తూ రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమానికి కనీసం తమకు ఆహ్వానం కూడా అందలేదని, టిడిపి నేతలు మండిపడుతున్నారు. అందుకే తామంతా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతున్నా తమ పార్టీ అధినేత ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు గారికి కనీసం ఈ విషయం పై చెప్పలేదని మండి పడ్డారు. అయితే ఈ రోజు నుంచి కొత్త జిల్లాలకు సంభందించిన అన్ని పనులు అధికారికం గానే జరగనున్నాయి. అయితే జిల్లాల్లో కేంద్రాలు మార్పు, డివిజన్లు మార్చడం , అన్ని జరిగిపోతున్నాయి. ఇలాంటి ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో విపక్షాలను భాగస్వామ్యం చేయకపోవడం పై వైసిపి ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కుంటుంది. ఇది ఏదో వైసిపి పార్టీ కార్యక్రమం లాగా ఉంది కాని, ఒక రాష్ట్రస్ధాయి కార్యక్రమం లాగా లేదని విమర్శిస్తున్నారు.
ఇలాంటి రాష్ట్రస్ధాయి కార్యక్రమాలు చేసేటప్పుడు అదికార పక్షంలో ఎవరు ఉన్నా ప్రతిపక్షాలను ఆహ్వానించడం సాంప్రదాయం. జగన్ ప్రభుత్వం మాత్రం కనీసం టిడిపి వారికి ఆహ్వానం కూడా పంపలేదు. పైగా ఈ జిల్లాల విభజనకు సంభందించి పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ కూడా వేయించారు. ఇంత హంగామా చేసిన వైసిపి కి ప్రతిపక్షాలను ఆహ్వానిచలేక పోవడం పై దారుణమైన విమర్శలు ఎదుర్కుంటుంది. అయితే మరో వైపు, జగన్ మాత్రం ఇంత పెద్ద కార్య క్రమాన్ని తన కాంపు ఆఫీస్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 9:45 మద్యలో ప్రారంభించారు. అయితే ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కార్యక్రమం బహిరంగ సభలో ఏర్పాటు చెయ్యకపోవడం పై , అందులోను కనీసం విపక్షాలకు ఆహ్వానం ఇవ్వకుండా , కేవలం కాంపు ఆఫీసులో వర్చువల్ ఏర్పాటు చేయడం , ప్రతిపక్ష్లాలకే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా అయోమయంలో గురిచేసింది. గతంలో చంద్రబాబు అమరావతి రాజధాని శంకుస్థాపనకు పిలిచినా, జగన్ రాలేదు. అప్పట్లో అలా వ్యవహరించి, ఇప్పుడు ఇలా వ్యవహరిస్తూ, తానేదో గొప్ప అనే విధంగా జగన్ ప్రవర్తిస్తున్న తీరు, అప్పుడు, ఇప్పుడు కూడా విమర్శల పాలు అవుతుంది.