ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గా ఉంటూ, ఇటీవలే కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ అయిన నరసింహన్ ఎట్టకేలకు తెలంగాణా నుంచి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో, తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు నియమించింది. ఆమె మొన్నటి దాక తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా కొనసాగారు. బీజేపీని అంటిపెట్టుకుని ఉన్నందుకు, మోడీ ఆమెకు గవర్నర్ గా ప్రొమోషన్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఇక మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్రం కొత్త గవర్నర్లను ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా బదిలీ చేసింది. హిమాచల్ ప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా బండారు దత్తాత్రేయను నియమించింది. కేరళ గవర్నర్‌గా ఆసిఫ్ మొహ్మద్ ఖాన్ నియమించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదేళ్ళ పాటు నరసింహన్ గవర్నర్ గా పని చేసారు. తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలకు కలిసి కట్టుగా గవర్నర్ గా పని చేసారు. ఇటీవాలే ఆయన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగించి, కేవలం తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే గవర్నర్ గా ఉంచారు. ఇప్పుడు బదిలీ సెహ్సారు. దీంతో పాటు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన గవర్నర్‌గా కూడా నరసింహన్ గుర్తింపు పొందారు. దాదాపుగా పదేళ్లుకు పైగా ఆయన తెలంగాణ గవర్నర్‌గా కొనసాగారు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ గవర్నర్‌గా ఉండగా ఇటీవలే ఏపీకి బిశ్వభూషన్ హరిచందన్‌ను కొత్త గవర్నర్‌గా నియమించారు. రెండు రోజుల క్రితమే నరసింహన్ ఆయన బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు ఇచ్చారు.
రాజ్‌భవన్‌లో జరిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. తాను గవర్నర్‌గా ఉన్నా లేకున్నా 2020 ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించి రాజ్ భవన్ రావాలని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆయన నిజంగానే బదిలీ అయ్యారు. నరింహన్ అటు సోనియా గాంధీకి, ఇటు మోడీకి కూడా సన్నిహితంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్ళ పాటు గవర్నర్ గా కొనసాగారు. అటు విభజన సమయంలో, ఇటు ప్రత్యెక హోదా ఉద్యమం అప్పుడు కూడా, తెలంగాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ అధిష్టానానికి, చంద్రబాబుకు గ్యాప్ రావటానికి నరసింహన్ కారణం అని తెలుగుదేశం పార్టీ అనేకసార్లు బహిరంగంగా కూడా ఆరోపించింది.