ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ వేగం పుంజుకుంటోంది. విజయవాడ కేంద్రంగా మరో ప్రతిష్టాత్మక ఐటీ టవర్ నిర్మాణానికి ఇవాళ పునాదిరాయి పడనుంది. గురువారం (నవంబర్23) సాయంత్రం 4 గంటలకు గన్నవరం మేధాటవర్స్ ప్రాంగణంలో నూతన ఐటీ టవర్ నిర్మాణానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. రానున్న కొద్ధి రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థల ప్రారంభోత్సవాలకు సిద్ధమయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో ఇప్పటి వరకూ రాష్ట్రానికి గణనీయమైన వృద్ధి నమోదైంది. పెరుగుతున్న కంపెనీల దృష్ట్యా రాష్ట్రంలో కొత్త ఐటీ పార్కుల ఏర్పాటుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు వేగవంతం చేసారు.
ఏడాది క్రితం ఖాళీ ఇయిన ఐటీ టవర్‌మేధ ఇప్పుడు కొత్త కంపెనీలు, ప్రముఖ కంపెనీలు క్యూ కడుతుండటంతో వాటికి స్థానం సరిపోని పరిస్థితి నెలకొంది.ప్రస్తుతం ఇక్కడ 9 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.ఏ ఒక్క సమస్యతోనూ ఐటీ అభివృద్ధి ఆగిపోకూడదనే ఆలోచనతో కొత్త టవర్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు. ఈ టవర్‌ను అత్యంత వేగంగా, సుందరంగా, ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉండేలా నిర్మించనున్నారు. నూతన ఐటి టవర్ ద్వారా4.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
అందుబాటులోకి రానుంది. రెండో పార్కు నిర్మాణానికి ఎల్ అండ్ టీ, గురువారం (నవంబర్23) భూమి పూజ ఏర్పాట్లు చేసింది. ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా గురువారం (నవంబర్23) కార్యక్రమం జరగనుంది. మంత్రిగా లోకేశ్ బాధ్యతలు చేపట్టాక తీసుకున్న పలు విప్లవాత్మక నిర్ణయాలతో ఐటీ రంగం క్రమేణా వృద్ధి సాధిస్తోంది. గన్నవరం విమానాశ్రయం వద్ద ఏడాది క్రితం వరకూ మేధా టవర్స్‌లో ఐటీ కంపెనీల ఆక్యుపెన్సీ 10 శాతమే. అప్పటివరకూ ఉన్న అరకొర కంపెనీలు ఖాళీ చేశాయి. ఐటీ కంపెనీల రాకకు మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవటంతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. సరికొత్త ప్రోత్సాహాకాలు ప్రకటించారు.
కొత్త పాలసీలతో ఐటీ కంపెనీలు నవ్యాంధ్రలో అడుగిడడం మొదలు పెట్టాయి.మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయాలతో 2016 చివరినాటికి ఖాళీగా ఐటీ టవర్ మేధ ఇప్పుడు పూర్తిగా ఐటీ కంపెనీల కార్యకలాపాలతో కళకళలాడుతోంది. ఎంఎన్‌సీ కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతుండటంతో సెకండ్ ఫేజ్ ఐటీ టవర్ అత్యవసరమైంది. ఏ ఒక్క సమస్యతోనూ ఐటీ అభివృద్ధి ఆగిపోకూడదనే ఆలోచనతో కొత్త టవర్ నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నారు. ఈ టవర్‌ను అత్యంత వేగంగా, సుందరంగా, ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉండేలా నిర్మించనున్నారు. నూతన ఐటి టవర్ ద్వారా 4.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్
అందుబాటులోకి రానుంది.