గత ప్రభుత్వ హయంలో, చంద్రబాబుని చీటికి మాటికీ విసిగిస్తూ, మా జాతి మా జాతి అంటూ, ముద్రగడ పద్మనాభం చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గతంలో చంద్రబాబు కాపు కార్పొరేషన్ పెట్టి చదవుకు సహకరించటం, కార్లు ఇవ్వటం, లోన్లు ఇవ్వటం లాంటివి చేసే వారు. అయితే చివరల్లో 5 శాతం రిజర్వేషన్ కూడా ఇచ్చారు. అయినా ముద్రగడ మాత్రం, చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలవాలని పని చేసారు. ఆయన అనుకున్నట్టే జగన్ వచ్చారు. కానే రిజర్వేషన్ రద్దు చేసారు, కాపు కార్పొరేషన్ నుంచి లోన్లు ఆగిపోయాయి, విదేశీ విద్య ఆగిపోయింది. అయినా ముద్రగడ మాత్రం కుయ్యి కయ్యి మనలేదు. చివరకు ఒక రోజు, నన్ను సోషల్ మీడియాలో తిడుతున్నారు, నేను కాపు ఉద్యమం చెయ్యను అంటూ, తప్పుకున్నారు. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్య పరిచింది. గత ప్రభుత్వ హయం కంటే, ఇప్పుడే కాపులకు అన్యాయం జరుగుతున్న సమయంలో, ముద్రగడ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటంతో, ఇప్పుడు కాపు ఉద్యమం ముందుండి నడిపించటానికి, మరో నేత రెడీ అవుతున్నారు.
ఆయనే సీనియర్ నేత మాజీ ఎంపీ చేగొండి వెంకట హరి రామజోగయ్య. కాపుల తరుపున పోరడానికి, ఆయన కాపు సంక్షేమ సేనను ప్రారంభించారు. పశ్చిమ గోదావరిలోని పాలకొల్లులో, తన నివాసం నుంచి, ఈ వివరాలు చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా బీసిల కోసం, కాపులను దూరం పెట్టారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత, కాపులను దగ్గర చేసుకోవానికి, కాపు నేస్తం అంటూ, 50 లక్షల మంది ఉంటే, కేవలం 2.50 లక్షల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని, జగన్ పై విమర్శలు గుప్పించారు. అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ రద్దు చేసారని అన్నారు. ఈ పరిస్థితిలో కాపులకు జరుగుతున్న అన్యాయాల పై మాట్లాడటానికి, కాపు సంక్షేమ సేనను మొదలు పెట్టినట్టు చెప్పారు హరిరామ జోగయ్య. తదుపరి కార్యాచరణ తొందరలో ప్రకటిస్తామని అన్నారు.