ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అనేది లేకుండా చేస్తా, ఎవరైనా తాగాలి అంటే ఫైవ్ స్టార్ హోటల్స్ లోనే మద్యం దొరుకుంతుంది అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి హామీకి విరుద్ధంగా కొత్త లిక్కర్ పాలసీ బయటకు వచ్చింది. ఈ కొత్త లిక్కర్ పాలసీలో ఉన్న కొన్ని అంశాలు చూస్తే షాక్ కొట్టాల్సిందే. ఇలా అయితే మద్య నిషేధం ఎలా చేస్తారు అనే అనుమానం కలగక మానదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో, మద్యం షాపులు అని ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకుని, కొన్ని షాపులను ప్రభుత్వం తగ్గించింది. అయితే ఈ షాపుల్లో ఊరు పేరు లేని బ్రాండ్లు, అధిక రేటుకి అమ్ముతూ ప్రజలను మరింత బలహీనులను చేసారు. అందుకే షాపులు తగ్గించినా, ఆదాయం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు సరి కదా, సెప్టెంబర్ నెలలో అయితే భారీగా పెరిగింది కూడా. 2019 సెప్టెంబర్ తో పోల్చుకుంటే, ఈ ఏడాది సెప్టెంబర్ లో ఇంకా నెల పూర్తి కాక ముందే, పోయిన ఏడాది కంటే, 250 కోట్లు అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి.

మద్యం ధరలు పెంచితే చాలు, మద్య నిషేధం అవుతుంది అనే అధికార పార్టీ ప్రచారానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది. అయితే ఇది ఇలా ఉంటే ప్రభుత్వం నిన్న విడుదల చేసిన కొత్త లిక్కర్ పాలసీలో, ఈ ఏడాది తగ్గిస్తాం అని చెప్పిన, లిక్కర్ షాపులు తగ్గుదల ప్రస్తావనే లేదు. అది లేక పోగా, ఏకంగా లిక్కర్ మాల్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లిక్కర్ మాల్స్ అంటే, సూపర్ మార్కెట్ లాగా, ఒక మాల్ లో లిక్కర్ అమ్ముతారు. ఒక వైపు మద్య నిషేధం అని చెప్తూ, మరో పక్క ఏకంగా లిక్కర్ మాల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం చూసి, అందరూ షాక్ అయ్యారు. రాబోయే కాలంలో, ఫైవ్ స్టార్ హోటల్స్ కే మద్యం సరఫరా ఉంటుంది అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గారే, ఇప్పుడు ఏకంగా మద్యం మాల్స్ ఏర్పాటుకు అవకాసం ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వటం పట్ల, ఒకింత షాక్ అనే చెప్పాలి. అయితే అసలకే ఆదాయం లేని ప్రభుత్వానికి, మద్యం ఆదాయమే నెట్టుకువస్తుంది అనటంలో సందేహం లేదు. రాబోయే కాలంలో మద్యం నిషేధం దిశగా ఎలా అడుగులు వేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read