విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య రైలు ప్రయాణం, 351 కి.మీలు... ఏదైనా ట్రాక్ లో ఇబ్బంది వస్తే, ఇక అంతే సంగతులు... ట్రాక్ బాగుపడే దాకా రైళ్లను రద్దు చేయడమో, ఆలస్యంగా నడపడమో, గుంటూరు మీదుగా మళ్లింపు మార్గంలో నడపడమో జరుగుతోంది.... ఇప్పుడు ప్రత్యామ్నాయ రైలు మార్గం అందుబాటులోకి రావటమే కాక, దాదాపు 60 కి.మీలు దూరం కూడా తగ్గనుంది. విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య ట్రైన్ ప్రయాణం త్వరలో, 291 కి.మీ. దూరానికి తగ్గనుంది.

విజయవాడ సమీపంలోని మోటుమర్రి దగ్గర నుంచి నడికుడి సమీపంలోని విష్ణుపురం వరకు రూ.500 కోట్లు ఖర్చు చేసి, కొత్త రైల్వే లైను నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీంతో విజయవాడ-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణం 291 కి.మీ తగ్గింది. అయితే ప్రస్తుతం, గూడ్స్ ట్రైన్ లు మాత్రమే, ఈ మార్గంలో వెళ్తున్నాయి.

ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు వెళ్ళాలి అంటే, ముందుగా అటు వచ్చే స్టేషన్లలో ప్లాట్‌ఫాంలు, వంతెనలు, తదితర నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మార్గంలో మోటుమర్రి, మక్కపేట, జగ్గయ్యపేట రైల్వేస్టేషన్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలో ఉండగా, రామాపురం, మేళ్లచెరువు, మట్టంపల్లి, వరదాపురం, జాన్‌పహాడ్‌, విష్ణుపురం స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయి.

విజయవాడ నుంచి బయలుదేరిన రైలు మోటుమర్రి మీదుగా విష్ణుపురం చేరుకుంటే ఈ లైను గుంటూరు మార్గంలో కలుస్తుంది. ఇక్కడి నుంచి రైలు నల్గొండ, బీబీనగర్‌, మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read