జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో బలమైనది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే, జగన్ మోహన్ రెడ్డి ఫేక్ అని. ఇందుకు తెలుగుదేశం పార్టీ అనేక ఉదాహరణలు చెప్తుంది. అయితే ఇప్పుడు తాజాగా మరో ఉదాహరణ తెలుగుదేశం పార్టీ లేవనెత్తింది. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన అతి పెద్ద హామీ, పెన్షన్ మూడు వేలు చేస్తాను అని. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, అది మర్చిపోయారు. అదేమిటి అంటే, ఏడాదికి రూ.250 పెంచుతాను అంటున్నారు. సరే పోనీ, అలా అయినా చేసారా అంటే, మూడో ఏడాది వస్తున్నా, ఆ ఊసే లేదు. ఇప్పుడు ఎట్టకేలకు మూడో ఏడాది రూ.250 పెంచుతున్నారు. రేపటి నుంచి ఈ పెంపు వస్తుంది. సరి ఇక్కడ వరకు బాగానే ఉంది. ఏదో ఒకటి ఇస్తున్నారు. అయితే ఇక్కడ చేస్తున్న ప్రచారంలో మాత్రం, అప్పట్లో చంద్రబాబు వెయ్యి రూపాయలు ఇచ్చాడు, నేను వచ్చిన తరువాత రూ.2250 ఇచ్చాను అని నిస్సిగ్గుగా అబద్ధం ఆడుతున్నారు. కొత్త ఏడాది కూడా కొత్త అబద్ధంతో మొదలు పెడుతున్నారు. చంద్రబాబు రూ.200 పెన్షన్ ని, అయుదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు చేసారు. తరువాత దాన్ని రెండు వేలు చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, చంద్రబాబు వెయ్యి రూపాయలే ఇచ్చారు అంటూ, కొత్త అబద్ధం మొదలు పెట్టారు.
ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు, వంచనలు, దారుణాలతో ముగిసిందని, రాబోయే కొత్తసంవత్సరంలోకూడా ఆయన తనదైనశైలిలో ప్రజలను వంచించడం, వారిని లూఠీ చేయడం వంటి కార్యక్రమాలనే కొనసాగిస్తున్నాడని, రూ.3వేల పింఛన్ ఇస్తానని అవ్వాతాతలను మూడేళ్లపాటు నిర్విరామంగా మోసగించిన జగన్మోహన్ రెడ్డి, 2022లో కూడా తనవాగ్ధానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరా వు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలే కరులతో మాట్లాడారు. "అధికారంలోకి వస్తే రూ.3వేల పింఛన్ ఇస్తానని చెప్పి అవ్వాతాతలను నిలువునా వంచించిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక అబ్బెబ్బే తాను అలా అనలేదని బుకాయించి, కేవలం రూ.250లు మాత్రమే పెంచి, సామాజిక పింఛన్లను రూ.2250కే పరిమితం చేశాడు. మూడేళ్లపాటు 2,250రూపాయలేఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ జనవరి నుంచి దాన్ని రూ.250లు పెంచి, రూ.2,500లు ఇస్తున్నట్లు ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి రేపటినుంచి ఇవ్వబోయే పింఛన్లకు కోట్లాది రూపాయల సొమ్ముని ప్రచారానికి తగలేశాడు. తొలినాళ్లలో రూ.250లు పెంచామనిచెప్పి చేసిన ప్రచారానికి, ఇప్పుడు చేస్తున్న ప్రచారానికి చేసిన ఖర్చుని అవ్వాతాతలకు ఇచ్చిఉంటే, ఆయన గతంలో ఇచ్చినట్లుగా రూ.3వేల పింఛన్ వాగ్ధానాన్ని నిలబెట్టుకునేవాడు. సొమ్ముపెంపులో వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి, పింఛన్ లబ్ధిదారుల సంఖ్యలో మాత్రం ఏటేటా కోతపెడుతున్నాడు." అని అన్నారు.