సాక్షిలో ఒక్క డేట్ తప్పించి ఏదీ నిజం ఉండదు అని టిడిపి అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలే జనం కూడా బలంగా నమ్ముతున్నారు. దీంతో సాక్షి, దాని అనుబంధ సంస్థలైన టివీ9, ఎన్టీవీలు కూడా విశ్వసనీయత కోల్పోయాయి. జగన్ కోసమే పనిచేసే ఐడ్రీమ్‌ని ఎవరూ దేకడం లేదు. దీంతో కొత్త చానళ్లు హైర్ చేసుకోవడం, ఐ డ్రీమ్ నుంచే కొత్త చానళ్లని క్రియేట్ చేసి వస్తున్నారు. నాగరాజు అనే ఐడ్రీమ్ యాంకర్ కాటు వేసే నాగరాజని అందరికీ తెలిసిపోయింది. ఇది ఐడ్రీమ్ కాదు, వైఎస్ జగన్ డ్రీమ్ అని క్లారిటీ వచ్చాక ఎవరూ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా రావడంలేదు. కల్లం హరికృష్ణారెడ్డి, నాగార్జున యాదవ్, బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి వంటి యూట్యూబ్ స్టార్లే గతి అయ్యారు. ఇప్పుడు కొత్తగా సిగ్నేచర్ స్టూడియోస్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అదీ ఐడ్రీమ్ వాళ్లదే. సుమన్ టీవీ చెప్పక్కర్లేదు. సాక్షిలో మొఖాలు చూడటంలేదని, పునరావాస పథకం కింద పోస్టులు కట్టబెట్టి కొమ్మినేని శ్రీనివాసరావుని బయటకి పంపారు. ఏం చేసినా సాక్షిని దేకేవాడే లేడు. అందుకే డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ చిన్నాల వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో కొత్త కొత్త చానెళ్లు పెడుతున్నారు. ఇవన్నీ ఎన్నికల వరకే. ఏ చానల్ లోగో, పేరు మారినా..యాంకర్ మాత్రం నాగరాజే. అంటే అర్థం అవుతోంది కదా. ఈ సంస్థల వెనుక ఉన్నది ఎవరో?
సాక్షిని ఎవ్వరూ నమ్మట్లేదు..ఐ డ్రీమ్ చెదిరింది..కొత్త చానళ్లతో వస్తున్నారు
Advertisements