ప్రభుత్వాలు తాము చేసింది చెప్పుకుంటూ, ప్రచారం చేయటం, మన తెలుగు రాష్ట్రాల్లో సర్వ సాధారణం. అయితే గతంలో చంద్రబాబు ఏదైనా ప్రకటన ఇస్తే, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటూ, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి అల్లరి అల్లరి చేసే వారు. అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత, అప్పట్లో ఆయన చెప్పిన మాటలు మార్చిపోయారో ఏమో కాని, ప్రతి రోజు ఏదో ఒక ప్రకటన వస్తూనే ఉంటుంది అంటే ఆశ్చర్యం కాదు. వారం, 15 రోజుల్లో ఒక్కసారి అయినా తమకు కావాల్సిన పత్రికల్లో ఫుల్ పేజ్ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. ఇక కొన్ని కొన్ని సార్లు అయితే, వేరే భాషల్లో కూడా ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా వేరే రాష్ట్రాల్లో, వేరే భాషల్లో కూడా కొన్ని సందర్భాల్లో ప్రకటనలు ఇవ్వటం పై పలువురు ఆశ్చర్య పోతున్నారు. అయితే ఇక్కడ రూల్స్ ప్రకారం అయితే, సర్క్యులేషన్ ని బట్టి, ప్రకటనలు ఇవ్వాలి. సహజంగా ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ఈనాడుకి ఎక్కువ ప్రకటనలు ఇవ్వాలి. అయితే ఇక్కడ మాత్రం, వేరేగా కనపడుతుంది. ఒక సామాజిక కార్యకర్త వేసిన ఆర్టీఐ ప్రకారం, ఏ పత్రికకు ఎన్ని కోట్లు ఈ 15 నెలల్లో ఇచ్చారో, రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది. సమాచార, పౌర సంబంధాల శాఖ దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించింది.
అయితే ఇందులో సర్క్యులేషన్ ప్రకారం ఈనాడుకి ఎక్కవ వస్తుంది అనుకుంటే, అనూహ్యంగా జగన్ మోహన్ రెడ్డి సొంత పత్రిక అయిన, సాక్షి పత్రికకు ఎక్కువ ప్రకటనలు వెళ్ళాయి. గత ఏడాది మే నెల నుంచి, ఈ ఏడాది మే నెల వరకు, అంటే 2019 మే నుంచి, 2020 మే వరకు, ఏ పత్రికకు ఎంత విలువ చేసే ప్రకటనలు ఇచ్చారు అంటూ, సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం కోరగా, దానికి సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం, ఈ ఏడాది కాలంలో, కేవలం పత్రికా ప్రకటనలకే, ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు పెట్టింది. ఈ వంద కొట్లలో, సగానికి పైగా తమ సొంత చానెల్ సాక్షి కి ఇచ్చుకున్నారు. మొత్తంగా వంద కోట్లు ఖర్చు పెట్టగా, సాక్షికి 52 కోట్లు ఇవ్వగా, సర్క్యులేషన్ లో టాప్ లో ఉన్న ఈనాడుకి మాత్రం కేవలం 39 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఇక పోతే, మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి మాత్రం, అందరి కంటే తక్కువగా, కేవలం 25 లక్షలు మాత్రమె ప్రకటనలు ఇచ్చారు. ప్రజాశక్తి పేపర్ కు 2.98 కోట్లు, విశాలంధ్ర కు 1.87 కోట్లు, ఆంధ్రప్రభ పేపర్ కు 2.15 కోట్లు, వార్త పత్రికకు 1.35 కోట్లు, ఆంధ్రభూమి పాపర్ కు రూ.50 లక్షల ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇది కేవలం పత్రికలు మాత్రమే అని, మీడియాకి ఎంత ఇచ్చారో తెలియాల్సి ఉందని, అంటున్నారు.