నిన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ జిల్లా పెందుర్తి సబ్బవరం జంక్షన్ లో జరిగిన రోడ్ షోలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రధానంగా విపక్ష నేత జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు అందరూ పేపర్లు చదవాలని, జగన్ పై ఎన్ని కేసులు ఉన్నాయో బయటికొస్తాయని తెలిపారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో తనపై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రతి ఒక్కటీ వెల్లడించాల్సిందేనని అన్నారు. అయితే, ఈ రోజు పేపర్లు చూసిన వారికి, నిజంగా కొన్ని ఆసక్తి విషయాలు తెలిసాయి. జగన్ చెప్పేవి అన్నీ అబద్ధాలు అని, సాక్షి రోజు కొట్టే డబ్బా అంతా పచ్చి అబద్ధమని తేలింది. ఎందుకంటే, ఇవి ఎన్నికల కమిషన్ కు ఇచ్చే వివరాలు. ఇక్కడ ఏది దాయటానికి ఉండదు.
ముందుగా జగన్ గురించి చూస్తే, తన మీద ఉన్న సిబిఐ, ఈడీ కేసులు అన్నీ ఎత్తేసారు అంటూ హడావిడి చేసారు. తన పేపర్ లో, సోషల్ మీడియాలో హడావిడి చేసారు. అయితే నిన్న జగన్ ఇచ్చిన అఫిడవిట్ లో బండారం బయట పడింది. డప జిల్లా పులివెందులలో శుక్రవారం దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్‌లో తనపై నమోదైన కేసులు, వాటి దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో ప్రకటించారు. 11 సీబీఐ, 7 ఈడీ కేసులు, పోలీసుస్టేషన్లు, కింది కోర్టుల్లో 13 కేసులు ఉన్నాయని వివరించారు. తనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ నిరోధక చట్టాల కింద కేసులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అలాగే పరువునష్టం దావా, వర్గాలను రెచ్చగొట్టడం, అనుచిత ప్రవర్తనలాంటి మరికొన్ని కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక చంద్రబాబు విషయానికి వస్తే, చంద్రబాబు పై 18 కేసులు ఉన్నాయాని, అవన్నీ స్టేలు తెచ్చుకున్నారని, ఇలా సంవత్సరాలుగా దొంగ ప్రచారం చేసారు. నిజానికి ఆయన మీద ఉన్న రాజకీయ కేసులు, ఎప్పుడో కొట్టేసారు. కొన్ని అయితే అసలు కోర్ట్ పరిగణలోకి కూడా తీసుకోలేదు. కేవలం చంద్రబాబు పై బురద చల్లటానికే అని కోర్ట్ లు కొట్టేసాయి కూడా. అయినా, ప్రతి సారి, చంద్రబాబు పై 18 స్టేలు ఉన్నాయని, మా జగన్ ధైర్యంగా విచారణ ఎదుర్కుంటున్నారు అంటూ డబ్బా కొట్టే వారు. కాని జగన్ ఎన్ని సార్లు, స్టే కావాలని కోర్ట్ ని అడిగింది, ఇది స్టే ఇచ్చే కేసు కాదు, విచారణ జరగాలి అని, కింద కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ దాక చెప్పింది మాత్రం చెప్పరు. ఇది ఇలా ఉంటే, నిన్న చంద్రబాబు ఇచ్చిన అఫిడవిట్ లో, ఆయన మీద ఉన్న పెండింగ్ కేసు ఒకటే ఒకటి అని తేలింది. అది కూడా బాబ్లీ కేసు, ఒక ప్రాంత ప్రయోజనాలు కోసం అక్కడి ప్రజల కోసం చేసిన దర్నా మీద కేసు. ఇది ఇద్దరి నాయకులకు తేడా. అందుకే చంద్రబాబు, ఈ రోజు అందరినీ పత్రికలు చూడమంది.