గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్ మొహన్ రెడ్డి, ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై, ఎక్కువగా పోరాడింది, ఇసుక తవ్వకాల మీద. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, దాని వల్ల చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన చంద్రబాబు, దాని పై పెద్దగా ఆదాయం కూడా రాదని, దాని కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు అని భావించి, ఇసుకను ఉచితం చేసారు. అయితే అక్కడ లోడింగ్ చెయ్యటానికి, ట్రావెలింగ్ చార్జెస్ కింద, లోకల్ నాయకులు, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే వారు. అది ప్రాంతాన్ని బట్టి, మారుతూ ఉండేది. అంతే కాని, ప్రభుత్వానికి ఇసుక నుంచి ఆదాయం మాత్రం రాలేదు. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్ మాత్రం, ఈ విషయం పై గోలగోల చేసారు.

green 23072019 2

చంద్రబాబు ఇసుకాసురుడు అంటూ తన పత్రికల్లో కధనాలు వేసారు. ఇసుక అక్రమ రవాణా మొత్తం చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది అని, ఇసుకలో చంద్రబాబు వేల కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేసారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అక్రంగా ఇసుక అక్రమాలు చేస్తున్నారని, ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు అంటూ జగన్ మోహన్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. అయితే అప్పడు ట్రాక్టర్ ఇసుక 1500 ఉంటె, ఇప్పుడు 5 వేలు ఉంది. ఎవరు దోపిడీ చేసారో, ప్రజలకు ఇప్పుడు అర్ధమవుతుంది. అయితే, కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో, కొన్ని రోజుల క్రిందట ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ రోజు ఎన్జీటీలో జరిగిన విచారణ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన వాదన విని అందరూ అవాక్కయ్యారు.

green 23072019 3

గతంలో చంద్రబాబు ఇసుకలో తినేసాడు అని చెప్పిన జగన్, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే మాట మార్చారు. ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణలో, అసలు కృష్ణా నదిలో ఎలాంటి అక్రమ ఇసుక తవ్వకాలు జరగలేదు అంటూ, విచారణ సందర్భంగా, ఏపి ప్రభుత్వం తరుపున వాదన వినిపించారు. కేవలం కృష్ణా నదిలో జల రవాణా కోసం, ప్రకాశం బ్యారేజీ వద్ద పుడిక తీసామని చెప్పారు. అయితే దీని పై ఎన్జీటీ స్పందిస్తూ, ఈ తవ్వకాల కు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించగా, పుడికతీటకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని ప్రభుత్వం వాదించింది. అలాగే పూడిక తీసిన ఇసుకని అమరావతి నిర్మాణం కోసం వాడమని ఏపి ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో చంద్రబాబు ఇసుకను తవ్వేసారు అని చెప్పిన జగన్, ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే, అసలు ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదు అని చెప్పటంతో, వైసీపీ అభిమానులతో పాటు, సామాన్య ప్రజలు కూడా అవాక్కయ్యారు. రాజకీయం కోసం అప్పుడు ఆరోపణలు చేసి, ఇప్పుడు అధికారంలో ఉండగా, అంతా మంచిగా ఉందని చెప్పటంతో, రాజకీయ నాయకులు రాజకీయమే చేస్తారని, మరోసారి రుజువైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read