అమరావతి అంటేనే మరణం లేనిది.... ఇలాంటి అమరావతి నిర్మాణం ఆపాలని దుష్ట శక్తులు చేసిన కుట్రలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గూబ గుయ్యిమనే తీర్పు ఇచ్చింది... అమరావతి నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది... ఇక అమరావతి నిర్మాణానికి ఆటంకాలు తొలగిపోయాయి.... పర్యవనానని ఎటువంటి ఆటంకం కాకుండా, నిర్మాణాలు చేసుకోమని తీర్పు ఇచ్చింది... సైట్ క్లియరెన్స్ రావటంతో, ఇక అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదు... రాజధాని నిర్మాణానికి తగిన ప్రాంతం కాదంటూ, కొంత మందిని ముందుంచి, అమరావతి ద్వేషులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేయించి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశారు...
అమరావతికి వ్యతిరేకంగా శ్రీమన్నారయణ అనే వ్యక్తి జాతీయ హరిత ధర్మాసనంలో పిటిషన్ వేశారు. రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతం అమరావతి తగిన ప్రాంతం కాదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరారు. దీనిపై ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించింది... అన్ని విషయాలు కూలంకషంగా పరిశీలించిన తర్వాతే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశామని, అమరావతి నిర్మాణం చేపట్టడానికి అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతమని ఏపీ వాదించింది.
పిటిషనర్ లేవనెత్తిన అభ్యంతరాలకు తగిన రీతిలో జవాబిచ్చింది. వరద ముప్పు సమస్య లేకుండా ప్రణాళిక రూపొందించామని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలపరంగా నిర్మాణం జరుగుతుందని తెలిపింది. నాణ్యత, భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వం వివరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న ఈ ప్రాంతమే రాజధాని నిర్మాణానికి అత్యంత అనుకూలమని ఎన్జీటీలో వాదించింది. నిర్మాణం విషయంలో పర్యావరణ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతిని అడ్డుకునే అవసరం లేదు అంటూ తీర్పు ఇచ్చింది... అమరావతిని ఆపే సైకో గాళ్ళు, ఇంకో ప్లాన్ తో ముందుకు రండి... మీరు ఏమి చేసినా, మా అమరావతిని ఆపలేరు...