పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ, ఈ మూడు ప్రాజెక్ట్ లకు సంబంధించి పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్ళద్దు అని, గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా దీని పై ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఈ మూడు ప్రాజెక్ట్ లు సందర్శించి, ఒక నివేదికను కూడా అందచేయాలి అంటూ, ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో, ఈ కేసు విచారణ ఈ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు మళ్ళీ విచారణకు వచ్చింది. పురుషోత్తపట్నం విషయం పై జరిగిన విచారణ సందర్భంగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే పోలవరం ముంపుకి సంబంధించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వచించారు అని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ ఉల్లంఘనలు జరిగినా చర్యలు తీసుకోక పోవటం పై, కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకోకపోవడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం ఈ రోజు కేసు విచారణ సందర్భంగా, ఏపి ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్ట్ లలో ఉల్లంఘనల పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ngt 09082021 2

ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోకపోవడంపై ఎన్జీటీ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పోలవరం కాఫర్ డ్యామ్ వల్ల ముంపుపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది. పోలవరం ముంపుపై ఎందుకింత నిర్లక్షమని ఎన్జీటీ ప్రశ్నించింది.కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోలేదు అంటూ అసహనం వ్యక్తంక్ చేసింది. సీపీసీబీ నివేదికలో కేసు ముగించాలన్న ఆత్రుతే కనిపించిందని, చట్టబద్దంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ధి లోపించింది అంటూ వారి పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనిఖీలకు వెళ్లిన అధికారులు వాస్తవాలు వెల్లడించలేకపోయారని కమిటీ పై మండి పడింది. ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే ఎలా ? అంటూ ప్రశ్నించింది. పర్యావరణ ప్రభావ అంచనా తూతూమంత్రంగా చేశారుని, మూడేళ్ల నుంచి కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతున్నా పట్టించుకోలేదని చెప్తూ, సాయంత్రం పూర్తి తీర్పును ఇవ్వనున్నట్లు ఎన్జీటీ ధర్మాసనం పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read