ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా నదిపై నిర్మించ తలపెట్టిన, రాయలసీమ ఎత్తిపోతల పధకంకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి వ్యవహరిస్తున్న తీరు, మొదటి నుంచి వివాదాస్పదంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీరు పైన, అనేక ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి, పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మిస్తున్నారని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు. ఆ తరువాత, తెలంగాణా ప్రభుత్వం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాయలసీమ ఎత్తిపోతల పధకం ప్రాజెక్ట్ ని, అక్రమంగా నిర్మిస్తుంది అంటూ, ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులు మీద అనేక దఫాలుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. అలాగే ఒక స్పెషల్ టీం కూడా వచ్చి ప్రాజెక్ట్ పరిస్థితిని సమీక్షించింది. అయితే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ టీంకు సారైన సహకారం అందించలేదు అనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దశలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన కంటెంప్ట్ అఫ్ కోర్టు కింద ఆక్షన్ కు కూడా సిద్ధం అయ్యింది.
చీఫ్ సెక్రటరీని జైలుకి పంపుతాం అని, గతంలో ఇలాంటి విషయాల్లో జరిగిన తీర్పులు ఏమిటో తమకు చెప్పాలని గ్రీన్ ట్రిబ్యునల్ పిటీషనర్ ను ఆదేశించింది. తాము నిర్మాణాలు చేపట్టవద్దని స్టే ఇచ్చినా, ముందుకు వెళ్లారు అనేదిది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహానికి కారణం. అయితే గత కొన్ని నెలలుగా, విపక్షాల వాదనలు, ఇవన్నీ విన్న నేపధ్యంలో, పర్యావరణ అనుమతులు లేకుండా, ఎట్టి పరిస్థితిలో నిర్మాణం చేపట్టటం కుదరదని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీ కూడా బయటకు వచ్చింది. పర్యావరణ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితిలోనూ నిర్మాణం చేపట్టకూడదని, అలా చేపడితే, బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇదే సమయంలో చీఫ్ సెక్రటరీ పైన ఎలాంటి చర్యలు వద్దు అని, కూడా ఆదేశించింది. అయితే కేసీఆర్ తో రాసుకు పూసుకు తిరగే జగన్, ఈ ప్రాజెక్ట్ విషయంలో, ఎందుకు కేసీఆర్ తో మాట్లాడి సెటిల్ చేసుకోలేదో అర్ధం కావటం లేదు. చూడాలి మరి, తరువాత ఎలా ఉంటుందో.