రాష్ట్రం చేస్తున్న పనుల స్పీడ్ చూసి, కేంద్రం కూడా ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు కృష్ణాజిల్లా యంత్రాంగం చేసిన పని హాట్ టాపిక్ అయ్యింది. డిసెంబర్‌ 5, 2015 సంవత్సరంలో విజయవాడలో నితిన్‌ గడ్కరీ మొత్తం 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

వీటిలో అన్నింటికంటే ఆలస్యంగా పనులు ప్రారంభం అయ్యింది ఎన్‌హెచ్‌ - 221 ప్రాజెక్టు... కాని కేవలం 20 నెలల్లోనే మిగతా 4 ప్రాజెక్ట్ ల కంటే ముందుగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. త్వరలోనే ఈ రోడ్ కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతోంది.

అమరావతి రాజధానిని తెలంగాణ ప్రాంతంతో అనుసంధానం చేసే ప్రాజెక్ట్ ఈ, ఎన్‌హెచ్‌- 221. ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ సమీపంలోని పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్‌ వంతెన రాబోతోంది. అమరావతి రాజధాని ఎంట్రన్స్‌ ఇదే కాబోతుంది.

ఈ గ్రాండ్‌ ఎంట్రన్స్‌ను ఎన్‌హెచ్‌- 65 , ఎన్‌హెచ్‌- 221 లు అనుసంధానం అవుతాయి. ఇందులో ఎన్‌హెచ్‌ - 221 అతి ముఖ్యమైంది. తెలంగాణ ప్రాంతానికి దగ్గరగా అనుసంధానమయ్యే రోడ్డు ఇది. ఎన్‌హెచ్‌ - 221 ఇబ్రహీంపట్నం నుంచి మైలవరం, తిరువూరు నియోజకవర్గాల మీదుగా జగదల్‌పూర్‌కు వెళుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read