గత అయుదు నెలలుగా, ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న దాడులు పై తెలుగుదేశం పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటాలు మొదలు పెట్టింది ఇందులో భాగంగానే, ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘానికి, ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత, తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను, వారు మానవ హక్కుల సంఘం ముందు పెట్టారు. అన్ని ఆధారాలతో, తెలుగుదేశం పార్టీ, దాడుల వివరాలను సమర్పించింది. అయితే, ఫిర్యాదులో ఉన్న వేడి గమించిన మానవ హక్కుల సంఘం వెంటనే రియాక్ట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి, ఆ వివరాలు అన్నీ పంపించి, ఆరు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని, తెలిపింది. అయితే ఆ విచారణ జరుగుతూ ఉండగానే, అసలు అక్కడ జరుగుతున్న విషయాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటానికి, ఏకంగా జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులే ఇక్కడకు వచ్చారు.

nhc 29102019 2

గుంటూరు జిల్లాలోని పరిస్థితులను తమ కళ్ళారా చూడటానికి, జాతీయ మానవ హక్కుల సంఘం వచ్చింది. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నేతలు అలెర్ట్ అయ్యారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీ విచారణ మాత్రమే అనుకున్న వీరు, ఏకంగా మానవ హక్కుల సంఘం రంగంలోకి దిగటంతో, అవాక్కయ్యారు. నిన్న రాత్రి సమాచారం రావటంతో, ఒక వైసిపీ ఎమ్మెల్యే అర్ధరాత్రి సమావేశం ఏర్పాటు చేసారు. త రాత్రి 2 గంటల వరకు ఈ వ్యవహారంపై కార్యకర్తలతో ఓ వైసీపీ ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. కమిషన్ సభ్యులకు ఏం చెప్పాలి ? ఎలా చెప్పాలి ? అనే అంశాల పై అక్కడ వారికి చెప్పినట్టు, ఎలా ఈ విచారణ నుంచి బయట పడాలి అనే వ్యూహాలు పన్నినట్టు, ఒక వార్తా ఛానెల్ లో వార్తలు వచ్చాయి.

nhc 29102019 3

ఇక మరో పక్క, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీడీపీ నేతలు గల్లా జయదేవ్, నక్కా ఆనంద బాబు, అశోక్ బాబు, మద్దాలి గిరి, డొక్కా తదితరులు కలిసి, వివరించారు. వైసీపీ దాడులకు సంబందించి కొన్ని ఆధారాలను టీడీపీ నేతలు కమిషన్‌కు ఇచ్చారు. పొనుగోడులో ఇప్పటికీ అక్కడ ఇళ్ళకు అడ్డుగా ఉన్న గోడ, ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. జాతీయ మానవ హక్కుల సంఘంతో సమావేశం తరువాత, గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 800 మంది తెలుగుదేశం సానుభూతిపరుల పై వైసీపీ నేతలు దాడులు చేసారని గల్లా జయదేవ్ విమర్శించారు. ఇప్పటివరకు ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read