క-రో-నా సెకండ్ వేవ్ దేశంలో విలయతాండవం చేస్తుంది. చాలా రాష్ట్రాలు ఆంక్షలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది వేల కేసులు దాటుతున్నా, ఏపి ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. రోజు రోజుకీ కేసులు పెరుగుతూ ఉండటంతో, ఏపి ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. ఎట్టకేలకు ఆంక్షలు మోపింది. ఈ రోజు నుంచి రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఉప సంఘం, నిన్న సమావేశం అయి, జగన్ అనుమతి తీసుకుని నిన్న, వైద్య శాఖా మంత్రి ఆళ్ళ నాని, ఈ విషయం ప్రకటించారు. ఈ రోజు రాత్రి పది గంటల నుంచి, ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ ఉంటుంది. కేవలం ఎమర్జెన్సీ సర్వీస్ లు మినహాయించి, అన్ని సర్వీస్ లు నిలుపుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, రాత్రి పది గంటల నుంచి, ఉదయం 5 గంటల వరకు ఎవరూ రోడ్డుల పై సంచరించకుండా, ఇళ్ళ వద్దే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. దీంతో పోలీసులు కూడా, ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం, ఈ రోజు రాత్రి నుంచి, నైట్ కర్ఫ్యూ అమలు చేయటానికి రెడీ అయ్యారు. ప్రజలు సహకరించాలని కోరారు.
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో క-రో-నా ఆంక్షలు...
Advertisements