రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రెండు రోజుల నుంచి జిల్లాల పర్యటనలో ఉన్నారు. నిన్న అనంతపురం, కర్నూల్ జిల్లలో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్, ఈ రోజు కడప జిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పై, ఆయనతో పని చేసిన అనుభవాలు పంచుకుంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి కేసులు గురించి కూడా నిమ్మగడ్డ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు కడప జిల్లాలో ఒంటిమిట్టి వచ్చి, రాములోరి దర్శనం చేసుకుని, ఇక్కడ ఒక నిద్ర చేయాలని ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందని, ఈ రోజు ఆ కోరిక తీరిందని అన్నారు. రాములోరి దర్శనం ఎంతో మంచి అనుభూతి వచ్చిందని అన్నారు. అలాగే నిన్న హైకోర్టులో ఎలక్షన్ అడ్డుకోవటానికి, చాలా ప్రయత్నాలు చేసారని, ఎన్నో పిటీషన్ లు, పెద్ద పెద్ద లాయర్లు, రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జెనెరల్ కూడా ఉన్నారని, అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమర్ధవంతంగా వాదనలు వినిపించటంతో, కోర్టు అన్ని కేసులు కొట్టేసిందని, దీంతో ఇక ఎన్నికలకు ఎటువంటి అద్దంకి లేదని, ఎన్నికలను ఏ శక్తి అడ్డుకోలేదని అన్నారు. ఇక జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లా అని, వైఎస్ఆర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. తన కెరీర్ లో ఒక గొప్ప మలుపు వచ్చింది, రాజశేఖర్ రెడ్డి దగ్గర పని చేయటం వల్లే వచ్చిందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి తనను గుర్తించి, మూడేళ్ళు ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీగా అవకాసం ఇచ్చారని అన్నారు.

ysr 30012021 2

ఆ తరువాత రాజశేఖర్ రెడ్డి గారే, తనని గవర్నర్ వద్ద ప్రత్యెక అధికారిగా పెట్టారని అన్నారు. అలా రాజ్ భవన్ తో తాను 7 ఏళ్ళు ఉన్నానని, గవర్నర్ ఆశీస్సులతోనే తాను ఎన్నికల అధికారిగా నియామకం అయ్యానని అన్నారు. తనకు ఈ పదవులు అన్నీ రాజశేఖర్ రెడ్డి గారి వల్లే వచ్చిందని అనుకుంటున్నా అని, అందుకే ఆయన అంటే, తనకు ఎంతో అభిమానం అని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని అన్నారు. ఫైనాన్సు డిపార్టుమెంటు లో అనేక కీలక అంశాల్లో, మొహమాటం లేకుండా తాము అభిప్రాయం చెప్పే వాళ్ళం అని, అలా అని తమని ఆయన ఏ రోజు తప్పు బట్టలేదని అన్నారు. నేను మొహమాటం లేకుండా చెప్పటం, ఆయన అంగీకరించటం వల్ల, తరువాత చాలా మంది ఇబ్బందులు పడ్డారు కానీ, ఫైనాన్సు సెక్రటరీగా పని చేసిన నా పైన మాత్రం, ఏమి ఇబ్బంది రాలేదని, కేసులు గురించి మాట్లాడారు. నిజాయితీగా పని చేశాను కాబట్టి, ఏమి ఇబ్బంది రాలేదని అన్నారు. సిబిఐ కేసుల్లో కూడా నేను సాక్షిగా ఉన్నాని, ఇప్పటికే కొన్ని సాక్ష్యాలు కోర్టులో చెప్పానని, మళ్ళీ తరువాత కూడా చెప్పాలని, నాకు ఏ భయం లేదని, నాకు రక్షణ ఇచ్చే బాధ్యత కోర్టు కూడా ఇచ్చిందని, నాకు భయం లేదని, నన్ను ఏ శక్తి అడ్డుకోలేదని, నేను నిజాన్ని నమ్ముతా అని సంచలన వ్యాఖ్యలు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read