జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు, వాన్ పిక్ కేసులో A3గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్ట్ వార్త కలకలం రేపుతుంది. యూరోప్ పర్యటనలో విహార యాత్రకు వెళ్ళిన నిమ్మగడ్డ, సెర్బియా దేశం వెళ్లారు. అయితే ఆయన్ను అక్కడ స్థానిక బెల్‌గ్రేడ్‌ పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ విషయంలో ఏమి జరిగింది అని ఆరా తీస్తే, సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన పై రస్‌ అల్‌ ఖైమా దేశంలో ఇప్పటికే కేసు నమోదైంది. ప్రకాశం జిల్లాలోని వాన్‌పిక్‌ పోర్టు వ్యవహారానికి సంబంధించి కేసు నమోదు అయ్యింది. దీంతో ఆ దేశం నిమ్మగడ్డ పై ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. నిమ్మగడ్డను అరెస్ట్ చెయ్యాలి అన్నా, విచారణ చెయ్యాలి అన్నా, ఇక్కడ భారత దేశం అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం జగన్ హవా నడుస్తూ ఉండటంతో, ఇక్కడ పర్మిషన్ వచ్చే అవకాశం లేదు.

nimmagadda 31072019 2

అదీ కాక ఆయన పై, సీబీఐ, ఈడీలలో కేసులు ఉన్నాయి కాబట్టి, టెక్నికల్ గా కూడా, మన దేశం నిమ్మగడ్డను అప్పచెప్పే అవకాసం లేదు. అందుకే నిమ్మగడ్డను దేశం దాటితే అరెస్ట్ చేసే ప్లాన్ వేసారు. ఇందులో భాగంగానే, ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అయితే రస్‌ అల్‌ ఖైమా పోలీసులు చాకచక్యంగా వ్యవహించారు. ఇక్కడ ఇంటర్‌పోల్‌ ద్వారా ముందుగానే రెడ్‌కార్నర్‌ నోటీసు బయటకు వస్తే నిమ్మగడ్డ అప్రమత్తమై విదేశీ పర్యటనలకు వచ్చే అవకాసం లేదు. అందుకే రస్‌ అల్‌ ఖైమా పోలీసులు చాలాకాలంగా నిమ్మగడ్డ పై, ఆయన విదేశీ పర్యటనల పై కన్నేసి ఉంచారు. ఆయన ఎప్పుడైతే యూరోప్ పర్యటనకు వస్తున్నారని తెలిసిందే, అప్పుడు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించటంతో, నిమ్మగడ్డ బెల్‌గ్రేడ్‌ విమానాశ్రయంలో దిగీదిగగానే అక్కడి పోలీసులు అరెస్ట్ చేసారు.

nimmagadda 31072019 3

అయితే, నిమ్మగడ్డ అరెస్ట్ వార్త తెలియటంతో, వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిమ్మగడ్డ ప్రసాద్ ను వెంటనే విడుదల చెయ్యాలని, ఏకంగా 22 మంది ఎంపీలు లేఖ రాసి, సంతకాలు చేసి, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌కు అందించటం సంచలనంగా మారింది. ఆయన మీద మన దేశంలో కేసులు ఏమి లేవని చెప్పారు. అయితే నిన్న సాయంత్రమే, నిమ్మగడ్డకు ఈడీ రిలీఫ్ ఇచ్చింది. ఇది యాద్రుచికంగా జరిగిందా, లేక నిమ్మగడ్డకు మన దేశంలో ఏ కేసు లేదు అని, సెర్బియా పోలీసులతో వాదించటానికి ఇలా చేసారా అనేది తెలియాలి. మొత్తానికి విదేశీ పోలీసులు, మనోళ్ళు చేసిన ఘనకార్యానికి ట్రాప్ వేసి పట్టుకుంటుంటే, మన దేశంలో మాత్రం, అదే రోజు సాయంత్రానికి, అదే కేసు పై అభియోగాలు అన్నీ తప్పు అనే విధంగా తీర్పులు వస్తున్నాయి. నిజం ఏమిటో సెర్బియా పోలీసులే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read