నిన్న ప్రివిలేజ్ కమిటీ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు నోటీస్ ఇచ్చిందో, దానికి నిన్న ఆయన వివరణ ఇవ్వటం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి, తానూ వ్యాక్సిన్ వేసుకున్నా ని, ప్రయాణాలు చేయవద్దని చెప్పారని, ఆయన నిన్న లేఖలో తెలుపుతూ, తాను అసలు ఈ పరిధిలోకి రానని తేల్చి చెప్తూ, నిన్న లేఖ రాసారు. దీని పై ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే, నిమ్మగడ్డ మరో సంచలన నిర్ణయానికి తెర లేపారు. తాను గవర్నర్ కార్యాలయంలో జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ కూడా బయటకు లీక్ అవుతున్నాయి అంటూ, అనుమానం వ్యక్తం చేస్తూ, కోర్టులో పిటీషన్ వేసారు. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి గవర్నర్ కార్యలయానికి రాస్తున్న లేఖలు, గవర్నర్ కార్యాలయం నుంచి లీక్ అవుతున్నాయని అనుమానం వ్యక్తం చేసే విధంగా ఆయన పిటీషన్ వేసారు. ఈ రోజు హైకోర్టులో శనివారం అయినా కూడా, ఈ రోజు హైకోర్టు వర్కింగ్ డే కావటంతో, ఆయన పిటీషన్ 27వ నంబర్ గా, హైకోర్టు లో లిస్టు అయ్యింది. 12 గంటల ప్రాంతంలో హైకోర్టు ముందుకు విచారణకు వచ్చే అవకాసం ఉంది. దీంట్లో ప్రధానంగా గవర్నర్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, మంత్రి బొత్సా, మంత్రి పెద్దిరెడ్డితో పాటుగా మరి కొంత మందిని ఈ పిటీషన్ లో ప్రతివాదులుగా పేర్కోన్నారు.
ముఖ్యంగా గవర్నర్ కు రాసే ఉత్తరులు అన్నీ, గోప్యతగా ఉంచాలని, బయటకు రాకూడదు అని, చివరకు తాను సెలవు పెట్టిన విషయం కూడా బయటకు వస్తున్నాయని, మంత్రులు మాట్లాడుతూ, తాను రాసిన లేఖ సోషల్ మీడియాలో చూస్తున్నాం అని బహిరంగంగా చెప్తున్నారు, అసలు తాను , గవర్నర్ కు రాసిన లేఖ ఎలా బయటకు వస్తుందో, ఈ వ్యవహారం మొత్తం విచారణ చేపించాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపించాలని, నిమ్మగడ్డ ఈ పిటీషన్ ద్వారా, హైకోర్టుని అభ్యర్ధించారు. అత్యంత రహస్యంగా ఉండే, ఉత్తర ప్రత్యుత్తరాలు, ఎలా బయటకు వస్తున్నాయి, గవర్నర్ కు రాసిన లేఖల విషయంలో ఎలా పబ్లిక్ అవుతున్నాయి, అవి ప్రివిలేజ్ లెటర్స్, అవి ఎందుకు బహిర్గతం అవుతున్నాయి అని, సిబిఐ విచారణకు ఆదేశించాలని కోర్టుని కోరారు. ముఖ్యంగా మంత్రి బొత్సా, మంత్రి పెద్దిరెడ్డికి కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చారు అంటే, తనకు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్ కు కౌంటర్ గా, వారిని కూడా సమాధానం చెప్పేలా, ఈ పిటీషన్ వేసినట్టు తెలుస్తుంది. మరి హైకోర్టు, ఈ విషయంలో ఏమి చెప్తుందో చూడాలి.