ఎస్ఈసీగా నిమ్మగడ్డ తొలగింపుపై ఏపీ హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఉదయం 11గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల పాటు విచారణ కొనసాగింది. పిటిషనర్ తరపు వాదనలను, సీనియర్ న్యాయవాదులు బండారుపల్లి ఆదినారాయణ, వేదుల నారాయణ వినిపించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తొలగించడం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంలో, ప్రభుత్వాన్ని అదిరిపోయే ప్రశ్న అడిగింది హైకోర్ట్. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి ఎస్ఈసీని తొలగించినప్పుడు మున్సిపల్ యాక్ట్‌ను అమలుచేయలేదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నట్టా అని ధర్మాసనం ప్రశ్నించింది. కోర్ట్ అనూహ్యంగా, ఈ పాయింట్ తీసుకు రావటంతో, ప్రభుత్వం ఇరుకున పడినట్టే అని చెప్పాలి.

అయితే, వాదనలకు సమయం ముగియటంతో, కేసు విచారణ రేపిటికి వాయిదా పడింది. మరో పక్క, ఈ రోజు తమ లాయర్లు రాలేదని, విచారణ వాయిదా వెయ్యాలని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోరారు. అయితే, దీనికి కోర్ట్ ఒప్పుకోలేదు. రాలేకపోతే, రిటన్ గా, తమకు వాదనలు చెప్పవచ్చు అని కోరటంతో, వాయిదా వెయ్యాలని అనుకున్న ప్రభుత్వం తరుపు ప్లాన్ వర్క్ అవ్వలేదు. కేసుకు సంబంధించిన గతంలో వాదించిన లాయర్లు మాత్రమే ఉండాలి ఇతరులు ఎవరూ రావడానికి వీల్లేదు అని చీఫ్ జస్టిస్ స్పష్టం చేసారు. ఇది ఇలా ఉంటే, ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖకు సంబంధించిన ఆంశాల్లో సీఐడీ విచారణ హైదరాబాద్కు మారింది. అక్కడి సీఐడీ విభాగం అధికారులు లేఖ విషయమై ఆదివారంనాడు కూడా విచారించారని తెలిసింది.

లేఖ విషయమై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమగ్ర విచారణ జరపాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగు ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిం దే. నిమ్మగడ్డ రమేష్ కు సహాయ కార్యదర్శిగా పనిచేసిన పీఎస్ సాంబమూర్తి, మరికొందరు సిబ్బంది హైదరాబాద్లో ఉంటున్నందున వారిని సీఐడీ అధికారులు అక్కడే విచారించాలని భావించారు. సీఐడీ మలి దశ విచారణలో భాగంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న సహాయ కార్యదర్శి సాంబమూర్తి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read