ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై హైకోర్టులో ఇవాళ కూడా కొనసాగిన విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం, తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. గురువారం ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. వాదనలు వినిపించేందుకు ప్రభుత్వానికి ధర్మాసనం ఒకటిన్నర రోజు సమయమిచ్చింది. శుక్రవారం విచారణ పూర్తి చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ రోజు కోర్టుముందు తన వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. అధికరణ 243k ప్రకారం సర్వీస్ నిబంధనలు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు వర్తిస్తాయని వాదించారు. ఆర్డినెన్సు తీసుకురావడానికి గల కారణాలేవీ స్పష్టంగా చెప్పనప్పుడు ఆర్డినెన్స్ చెల్లదని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడడమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా చెప్పిందని అన్నారు.

"ఎన్నికల సంస్కరణల పేరుతో 77 ఏళ్ల వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా నియమిస్తే ఆయన ఎంతవరకు సమర్థవంతంగా పనిచేయగలరు? రమేష్ కుమార్ నియామకాన్ని రాజ్యాంగంలోని అధికరణ 243k మేరకు నియమించారు. అధికరణ 200 ప్రకారం నియమించామని ప్రభుత్వం చెబుతోంది. అధికరణ 200 ప్రకారం చేయడానికి వీల్లేదని, ఎలక్షన్ కమిషనర్ నియామకాన్ని అధికరణ 243k ప్రకారమే చేపట్టాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ప్రభుత్వ ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశం ఉందని: సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తన వాదనలు వినిపించారు.

తనను రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా వదవి కాలం కన్నా ముందుగానే తొలిగించడంపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి కామినేని శ్రీనివా' సహా ఆరుగురు పిటీషన్ పిటీషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 'దీర్ఘ కాలం పాటు వాదనలు జరిగాయి, ఈ కేసుపై ఇటీవల ఏపీ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది, అయితే కేసులో ఫిర్యాదుదారుల తరపున న్యాయవాదులు వాదనలు చేస్తుండగా, పెద్ద సంఖ్యలో ఇతరుల మధ్యలోకి రావడంతో హైకోర్టు ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ, వాదనలు హైకోర్టులోనే మౌళికంగా చేపట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు పరిమితులకు లోబడి కొందరికి అనుమతినిచ్చి, విచారణను వాయిదా వేసింది. తిరిగి విచారణ సోమవారం కోర్టులోనే విచారణ ప్రారంభంకాగా, నిన్న వాదనలు విన్న కోర్ట్, ఈ రోజుకి వాయిదా వేసింది, ఈ రోజు కూడా వాదనలను విన్న కోర్ట్, విచారణ గురువారానికి వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read