ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, గత కొన్ని రోజలుగా స్లో అయినట్టు కనిపించారు. అన్ని పనులు ఒకదాని వెంట ఒకరి జరిగిపోతూ ఉండటం, ఆయన జిల్లాల పర్యటనలలో స్వయంగా ఉండటం, సమీక్షలు చేస్తూ, ఒక్కో పని చక్కబెడుతూ ఉండటంతో, ఆయన దూకుడు నిర్ణయాలకు కొద్దిగా బ్రేక్ పడింది. అయితే ఈ రోజు ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ తీసుకున్న మరో నిర్ణయంతో, ఒక్కసారిగా ఆయన మార్క్ కనిపించటంతో, అధికారులు షాక్ అయ్యారు. ప్రధానంగా పోయినసారి జరిగిన నామినేషన్ల సందర్భంగా చోటు చేసుకున్న ఏకాగ్రీవాలు అసహజంగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. 2020 మార్చి నెలలో, జడ్పిటీసీ, ఎంపీటీసీలకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పట్లో నామినేషన్ల ప్రక్రియ సందర్భంలో, అధికార పార్టీ చేసిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. చివరకు నామినేషన్ వేయించటానికి బుద్దా వెంకన్న, బొండా ఉమా లాంటి నేతలు వెళ్ళాల్సిన పరిస్థితి చూసాం. అయినా వారిని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన అరాచకం అందరూ చూసారు. ఇలాంటి సంఘటనల వల్ల, నామినేషన్ వేయటానికే భయపడ్డారు. చివరకు ఎకగ్రీవల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోయింది. సహజంగా 5 శాతం లోపు ఉండే ఏకాగ్రీవాలు, 25 శాతం వరకు వెళ్ళాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు గోల గోల చేసాయి.
అయితే అప్పట్లో ఎన్నికలు రద్దు అవ్వటం, ఇప్పుడు మళ్ళీ ప్రక్రియ మొదలు కావటంతో, అప్పట్లో జరిగిన జడ్పిటీసీ, ఎంపీటీసీల ఏకగ్రీవాల పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ ఏకాగ్రీవాలు అన్నీ రద్దు చేయాలని కోరుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయం పై దృష్టి పెట్టింది. పంచాయతీ ఎన్నికాలు తరువాత, జడ్పిటీసీ, ఎంపీటీసీల నోటిఫికేషన్ వచ్చే అవకాసం ఉంది. అయితే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, ఈ ఏకాగ్రీవాలు ఎక్కువగా అయ్యాయని గ్రహించిన ఎన్నికల కమిషన్, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కూడా అక్కడ జరుగుతూ ఉండటంతో, షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఏకాగ్రీవాలు అయిన చోట, ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్లు, అంటే ఎంపీడీవోలను బదిలీ చేయాలని ఆదేశించింది. ఏకంగా చిత్తూరు జిల్లాలో ఉన్న 30 మంది ఎంపీడీవోల పై చర్యలు తీసుకోమని, చీఫ్ సెక్రటరీకి నిమ్మగడ్డ లేఖ రాయటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది మంత్రి పెద్దిరెడ్డి అడ్డా కవాటంతో, ఇప్పుడు ఈ ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి. మరి చీఫ్ సెక్రటరీ, ఎన్నికల కమీషనర్ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తారా ? లేదా ఇది వరకు కొన్ని ఆదేశాలు కుదరవు అని చెప్పినట్టు, తిప్పి పంపిస్తారా అనేది చూడాల్సి ఉంది.