రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అసెంబ్లీ ప్రివేలేజ్ కమిటీ నుంచి నోటీసులు ఈ రోజు జారీ అయ్యాయి. నిన్న సాయంత్రం, అసెంబ్లీ ప్రివేలేజ్ కమిటీ, చైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం అయ్యింది. జూమే లో సమావేశం అయిన, ఈ సమావేశంలో మంత్రులు, బొత్సా సత్యన్నారాయణ, పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిగింది. గతంలో కూడా ఒకసారి ప్రివిలేజ్ కమితే సమావేశం జరిగింది. అప్పట్లోనే నిమ్మగడ్డకు నోటీసులు ఇవ్వటం పై చర్చించారు. చట్ట, న్యాయ పరమైన నిబంధనలు అన్నీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుందాం అని ఆ రోజు కమిటీ సమావేశం వాయిదా పడింది. అయితే ఈ సారి నిన్న సాయంత్రం ఆరు గంటలకు కమిటీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రులు బొత్సా, పెద్దిరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ కు చేసిన ఫిర్యాదు పై చర్చించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రివిలేజ్ కమిటీ నుంచి నోటీసులు పంపించాలని, స్పీకర్ ను కోరారు. విచారణకు సంబంధించి నోటీసులు పంపించటంతో పాటుగా, నిమ్మగడ్డను అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు, ఎల్టీసి మీద బయటకు వెళ్తున్నట్టు , సెలవు కావాలి అంటూ గవర్నర్ కు లేఖ రాసారు.

nimmagadda 18032021 2

గవర్నర్ వద్ద అనుమతి కూడా తీసుకున్నారు. అయితే ఈ లోపు ప్రివేలేజ్ కమిటీ మాత్రం, ఆయన విచారణకు అందుబాటులో ఉండాలని, నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాల్సి ఉంటుందని, అందువల్ల ఈ నోటీసులకు కూడా సమాధానం ఇవ్వాలని సూచించింది. అసెంబ్లీ ప్రివేలేజ్ కమిటీ ఆదేశాలు మేరకు, అసెంబ్లీ కార్యదర్శి, ఈ నోటీస్ ను, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, కొద్ది సేపటి క్రితం పంపించారు. అయితే ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన నోటీస్ అందుకున్న తరువాత, ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఆయన ప్రివేలేజ్ కమిటీ ముందు హాజరు అవుతారా, లేదా న్యాయపరంగా ఎదుర్కుంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ విషయం గవర్నర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళే అవకాసం ఉంది. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి, ఎన్నికల కమిషన్ ని పట్టుకుని, చంద్రబాబు దొడ్లో కట్టేసి ఎద్దు అంటూ తీవ్ర విమర్శలు చేయటం, నిమ్మగడ్డ మీ మంత్రులను అదుపులో ఉంచండి అని గవర్నర్ కు రాసిన లేఖ, బయట పెట్టటంతో, తమ హక్కులకు భంగం కలిగింది అంటూ మంత్రులు ఫిర్యాదు చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read