పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం, తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియో షూటింగ్ చేయలని స్పష్టం చేసింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని స్పష్టం చేసింది. దీంతో పాటు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలతో పాటుగా, సున్నితమైన గ్రామాల్లో కూడా పోలింగ్ ని వెబ్ క్యాస్టింగ్ తో పాటుగా, కౌంటింగ్ ని కూడా వీడియో షూటింగ్ చేయాలని చెప్పి, ఆదేశాలు ఇచ్చింది. ఎవరైతే పర్యవేక్షణ అధికారులు ఉన్నారో, వారు ఈ గ్రామాల్లో అందుబాటులో ఉండాలని కూడా స్పష్టం చేసింది. దీంతో పాటుగా కౌంటింగ్ సందర్భంగా ఏదైతే ఓట్ల తేడా తక్కువగా ఉన్న సమయంలో, అతి తక్కువగా మెజారిటీ వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్ కు అనుమతించాలని, ఆ రీకౌంటింగ్ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే జరగాలని చెప్పి, ఎన్నికల కమిషన్ తాజా ఆదేశాల్లో పేర్కొంది. అలాగే కౌంటింగ్ సమయంలో, కరెంటు పోతుందని, ఆ సమయంలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో, కరెంటు పోకుండా చూసుకోవాలని, అవసరం అయితే జెనరేటర్లు, ఇన్వర్టర్ లు పెట్టుకోవాలని ఎన్నికల కమిషన్ తమ అదేసలలో తెలిపింది.

nimmagadda 190222021 2

ఇటీవల రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పోలింగ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ వీడియో షూట్ చేయాలని పిటీషన్ దాఖలు చేయటంతో, దీని పై రాష్ట్ర హైకోర్టు, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల కమిషన్, ఎవరైనా పోటీలో ఉన్న అభ్యర్ధి, కౌంటింగ్ ని వీడియో షూట్ చేయాలని సూచిస్తే వెంటనే ఆ బాధ్యత రిటర్నింగ్ అధికారులు తీసుకోవాలని చెప్పి, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకల పై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రెండు రోజుల క్రితం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కౌంటింగ్ సమయంలో, డబుల్ డిజిట్ మెజారిటీ ఉన్నా రీకౌంటింగ్ చేస్తున్నారని, ఒకటి రెండు మూడు సార్లు రీకౌంటింగ్ పేరుతో, వైసీపీ మద్దతు దారులు గెలిచేలా చూస్తున్నారని, అలాగే కరెంటు తీసేసి కౌంటింగ్ లో అవకతవకలు చేస్తున్నారని, హైకోర్టు చెప్పినా ఎందుకు వీడియో షూట్ చేయటం లేదని ప్రశ్నించటంతో, ఎన్నికల కమిషన్ దిద్దుబాటు చర్యలు చేసిందనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read