నిమ్మగడ్డ రమేష్ తొలగింపు పిటిషన్ల పై హైకోర్టులో రేపు కూడా విచారణ జరగనుంది. నేడు నిమ్మగడ్డ తరపు న్యాయవాదితోపాటు పలువురు పిటిషనర్ల తరపు వాదనలు ధర్మాసనం వింది. మరికొందరి వాదనలు రేపు ధర్మాసనం విననుంది. తుది విచారణ రేపటికి ధర్మాసనం వాయిదా వేసింది. ఇవాళ పిటిషనర్ల వాదలను సుదీర్ఘంగా విన్నారు చీఫ్ జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ సత్యనారాయణ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మాసనం ఈ విచారణ చేసింది. నిమ్మగడ్డ రమేష్ తరపున సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, అశ్వనికుమార్ వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడే ఇస్తారని, ఎస్ఈసీ నియామకంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిమ్మగడ్డకు వర్తించదని ధర్మాసనానికి తెలియచేసారు, న్యాయవాది డీవీ సీతారామమూర్తి. పిల్ ను ఎందుకు అనుమతించాలో చెప్పాలని మరో లాయర్ వెంకటరమణను సీజే ప్రశ్నించారు. నిమ్మగడ్డను తొలగించడం రాజ్యాంగ విరుద్ధం కనుక పిల్ ను అనుమతించాలని సమాధానమిచ్చారు న్యాయవాది వెంకట రమణ.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆయన కులం ప్రస్తావన తీసుకురావడం, ఆయన కుమార్తెకు చంద్రబాబు ఉద్యోగం ఇచ్చారని.. సీఎం సహా మంత్రులు మాట్లాడటాన్ని తనవాదనలో వినిపించారు లాయర్ DSNV ప్రసాద్. మంత్రి వర్గాన్ని తొమ్మిదోపార్టీగా చేర్చి వారు ప్రెస్‌మీట్‌లలో నిమ్మగడ్డ పై చేసిన వ్యాఖ్యలు, టీవీ న్యూస్ క్లిప్పింగ్స్, పేపర్ కటింగ్‌లను అదనపు సాక్ష్యాలుగా పరిగణించాలన్న లాయర్ ప్రసాద్ కోరారు. గవర్నర్‌కు తప్పుడు సమాచారం అందించారని వాదించిన డీఎస్ఎన్‌వీ ప్రసాద్ బాబు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్‌ను ఎవరు రిప్రజెంట్ చేస్తారని లాయర్ ప్రసాద్‌ను ప్రశ్నించిన సీజే మహేశ్వరి. కేసు రేపటికి వాయిదా పడింది.
ష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎనీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం ఆ కేసుకు సంబంధించి రిప్లై పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. మొత్తం 17 పేజీల ప్రభుత్వ అఫిడవిట్లోని విషయాలపై అంశాలవారీగా 17 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. ప్రభుత్వం తన కౌంటర్లో సంబంధం లేని అంశాలను ప్రస్తావించిందని, ఎన్నికల సంస్కరణలు ఫిబ్రవరిలోనే ప్రారంభించామనడం వాస్తవం కాదని వివరించారు. ప్రభుత్వం ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఈసీ పదవీకాలాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా.. ఆ మార్పు పదవిలో ఉన్న అధికారికి వర్తించదని వివరించారు. ప్రభుత్వం చెబుతున్న సంస్కరణలు వాస్తవిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయని, వాస్తవానికి సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ అధికారపక్షానికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.