నేను గవర్నరు రాసిన లేఖలు లీక్ అయ్యా యి.. అవి పూర్తిగా కాన్ఫిడెన్షియల్ .. లీకేజీపై గవర్నర్ కార్యా లయ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినా విచారణలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పోలీస్లకు తగిన మార్గదర్శకాలు జారీచేస్తే ఆ పని నేనే చేశానని చెప్తారు. అందువల్ల సీబీఐతో విచారణ జరిపించేలా ఆదేశించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శతో పాటు , కేంద్ర హోంశాఖ, సీబీఐ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర మంత్రులు బొత్ససత్యనారా యణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.. లీకేజీపై 72 గంటల్లో మధ్యంతర నివేదిక ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక లపై ఎస్ఈసీపై పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తిని కూడా ప్రతివాదిగా చేర్చారు. నిమ్మగడ్డ పిటీషన్ సారాంశం ఇలా ఉంది...గవర్నర్‌కు నేను రాసిన లేఖలు అత్యంత గోప్యమైనవి... రాజ్యాంగంలోని 2433 ప్రకారం ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు గవర్నర్ సహాయ సహకారాలు అందించాల్సి ఉంటుంది.. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటు న్నందున కొన్ని అంశాలను గోప్యంగా గవర్నర్‌కు లేఖ ద్వారా తెలియజేశాను.. రెండు రాజ్యాంగ సంస్థలకు చెందిన కీలకమైన ఆ లేఖలను బహిర్గతం చేసయానికి వీల్లేదు. అయితే గోప్యత, ప్రత్యేక _ హక్కుల్లో భాగంగా కొందరు ఉద్దేశపూర్వకంగా బహిర్గతం చేశారు. లీకేజీ పై విచారణ జరపాలని పలుమార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్ ముఖ్య కార్యదర్శిని కోరాను.

nimmagadda 22032021 12

నేను కోరిన అంశంపై విచారణ జరపకపోవటంతో పాటు ఎలాంటి లీకులు లేవని గవర్నర్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి త్రోసి పుచ్చారు. ఇప్పటి వరకు లీకేజీ వెనుక వ్యక్తులను గుర్తించలేకపోయామని కోర్టుకు వివరించారు. కాగా ఈ నెల 18వ తేదీన అసెంబ్లీ కార్యదర్శి నుంచి నాకు లేఖ వచ్చింది. నేను రాసిన లేఖలు సోషల్ మీడియాలో లీకవ్వటం వల్ల వాటి ఆధారంగా సభాహక్కుల ఉల్లంఘన కింద మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో ఉంది. నా లేఖలు మంత్రుల ప్రతిష్టకు భంగం కలిగించాయనేది అందులో సారాంశం. కమిషనర్‌గా నేను నిర్వహించే విధుల పట్ల ప్రభుత్వ పెద్దలు సంతృప్తికరంగా లేరు.. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు నన్ను దూషించటంతో పాటు కుల ప్రస్తావన తీసు కొచ్చారు. నేను ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించా లని కోరుతూ గుంటూరుకు చెందిన మెట్టు రామిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు నేను గవర్నరు రాసిన లేఖను జతపరిచారు.

ఆయనకు ఆ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు.. నా నుంచి లీక్ అయ్యే అవకాశం లేదు.. నేను రాసే లేఖలు కార్యాల య ఉద్యోగులు, అధికారులెవరికీ తెలియదు.. ఈ పరిస్థితుల్లో లీకేజీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. ప్రభుత్వ చెప్పుచేతల్లో పనిచేసే ఏపీ పోలీసులకు మంచి సామర్థ్యం ఉందని ఆ లేఖల లేకేజీ తానే చేసినట్లుగా ఇరికించగలరు.. రాజ్యాంగ వ్యవస్థల మధ్య గోప్యత బహిర్గతమైతే మనుగడ కష్టమవుతుంది.. అందువల్ల సీబీఐచే విచారించాలని కోరారు. నిమ్మగడ్డ తరుపు సీనియర్ న్యాయవాది బీ ఆదినారాయణరావు వాదనలకు సిద్ధమయ్యారు. ఈ వ్యాజ్యం శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందనరావు బెంచి ముందుకు వచ్చింది. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అయినందున తాను ఈ వ్యాజ్యాన్ని విచారించబోనని జస్టిస్ రఘునందనరావు నిరాకరిస్తూ అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read