రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి నెలకొంది. హైకోర్టులో ఈ విషయం పై గతంలో పడిన కేసు విచారణకు రావటం, ఎన్నికల నిర్వహణ పై తమ అభిప్రాయం చెప్పాలి అంటూ ఎన్నికల కమిషన్ కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం, ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకునేందుకు, 28న సమావేశం ఏర్పాటు చేయటం తెలిసిందే. అయితే ఈ పరిణామం కంటే ముందే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జరిగే ఎన్నికల పై సమీక్ష చేస్తున్నాం అంటూ, దానికి హాజరు కావాలి అంటూ, ఈ రోజు ప్రభుత్వం వైపు నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఒక సందేశం వెళ్ళింది. సోమవారం నాడు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద ఈ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి హాజరు కావాలి అంటూ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమీషనర్, రాజ్యాంగబద్ద హోదాలో ఉంటారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు, హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉంటారు. పైగా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పని చేసి, పదవి విరమణ చేసిన హోదా కూడా ఉంది. అటువంటి హోదాలు, రాజ్యాంగాబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, సియం ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ నుంచి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను, సోమవారం ఉదయం సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలి అంటూ, మెసేజ్ పంపటం అనేది, తీవ్రమైన అధికార ఉల్లంఘన కింద పరిగణించారు.

ఈ నేపధంలోనే, నిమ్మగడ రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సెక్రటరీ నుంచి, మళ్ళీ తిరిగి సియం ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎస్ కు తిరిగి మరో మెసేజ్ పంపించారు. హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని, ఈ విధంగా మెసేజ్ ఇవ్వటం అనేది, న్యాయ సమ్మతం కాదు, చట్ట విరుద్ధం అని కూడా పేర్కొంటూ, ఇటువంటి ప్రయత్నాలు అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఒక బ్లేటంట్ అటెంప్ట్ చేస్తున్నారు అంటూ తీవ్రమైన పదజాలంలో మెసేజ్ పంపించారు. ఇప్పటికే ఈ అంశం కోర్టులో ఉండగా, ఇలా చేయటం పై, తాము ఈ విషయం పై కోర్టుకు కూడా చెప్తామని ఆ మెసేజ్ లో తెలిపారు. ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణి మోహన్ ని కూడా, ఆ సమావేశానికి తన అనుమతి లేకుండా వెళ్ళవద్దు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మెసేజ్ పంపించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో పాటు, ఈ నెల 26 నుంచి తాను, విజయవాడ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, తననుతో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని, ఆయన మెసేజ్ పంపించారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న ఈ మెసేజ్ ల యుద్ధం పై, ఆసక్తి నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read