ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి హైకోర్టు వద్దకు వెళ్లారు. గతంలో ప్రభుత్వం రాజ్యాంగా విరుద్ధంగా తన పై కక్ష సాధించి, విధుల్లో నుంచి తొలగించిందని చెప్తూ, న్యాయ పోరాటం చేసి, హైకోర్టు, సుప్రీం కోర్టులో గెలిచి మరీ, ఆయన మళ్ళీ పదవి పొందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి ఆయన హైకోర్టు తలుపులు తట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని, ఇది తమ స్వతంత్రతాకు ఇబ్బంది అని చెప్తూ, ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. గతంలో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో, వరుస పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి, నిమ్మగడ్డ పై ఎదురు దాడి చేసారు. తరువాత వారం రోజులకు నిమ్మగడ్డ, కేంద్ర హోం శాఖకు ఒక లేఖ రాసారు. తనకు కేంద్ర బలగాల బద్రత కావాలి అంటూ, ఎందుకో చెప్తూ, ఆయన ఒక పెద్ద లేఖ రాసారు. అయితే ఈ లేఖ అందినట్టు కేంద్రం, ఇటు నిమ్మగడ్డ కూడా తానే లేఖ రాసినట్టు చెప్పారు. కేంద్రం కూడా లేఖకు తగ్గట్టే కేంద్ర బద్రత కూడా ఇచ్చింది. అయితే ఈ లేఖ పై విజయసాయి రెడ్డి అభ్యంతరం తెలుపుతూ, దీని వెనుక కుట్ర ఉంది అంటూ డీజీపీకి కంప్లైంట్ చేసారు.

nimmagadda 03092020 2

తరువాత ఈ విషయం పై సిఐడి ఎంక్వయిరీ మొదలైంది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో కంప్యూటర్ తీసుకు వెళ్ళటం, అలాగే ఎలక్షన్ కమిషన్ సహాయ కార్యదర్శి సాంబమూర్తి ని ఎంక్వయిరీ చెయ్యటం లాంటివి చేసారు. అయితే ఇప్పుడు ఇదే వ్యవహారం పై నిమ్మగడ్డ హైకోర్టుని ఆశ్రయించారు. తమ విధుల్లో జోక్యం చేసుకుంటూ, తమ కంప్యూటర్ ని తీసుకు వెళ్ళారని, ఆ వస్తువులు ఇప్పించాలాని, అలాగే తమ సిబ్బంది పై పెట్టిన కేసులు, ఈ మొత్తం వ్యవహారం పై సిబిఐ విచారణ జరిపించాలని, పెట్టిన సిఐడి కేసుని కొట్టేయాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేసారు. అలాగే ఎస్‌ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టులో పిటీషన్ వేసారు. ఈ రెండు కేసులని కలిపి విచారిస్తామని చెప్పిన హైకోర్టు, కేసుని వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. నిమ్మగడ్డ వేసిన పిటీషన్ లో కేంద్ర హోం శాఖ సెక్రటరీ, అలాగే రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీ రాజు ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజే పీ, సిఐడిలను ప్రతివాదులుగా చేర్చారు. మరి ఈ కేసు పై హైకోర్టు ఎలానటి డైరక్షన్ ఇస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read