అధికార పార్టీ చేస్తున్న పనుల పై, మాట వినని అధికారుల పై, జూలు విదిల్చుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ సారి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి కూడా షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడితే తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వెయ్యండి అంటూ, వాళ్ళు గెలిస్తే గ్రామాలను ఏమి చేస్తారో చెప్తూ, ఒక మ్యానిఫెస్టో విడుదల చేసింది. శుభ్రమైన త్రాగు నీరు, భద్రత, పన్నులు బాదుడు నుంచి విముక్తి, స్వయం ఉపాధి, పరిశుభ్రమైన పల్లెలు అంటూ, పంచ సూత్రాలతో ఒక మ్యానిఫెస్టో విడుదల చేసారు. అయితే దీని పై భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయని, ఇందులో తెలుగుదేశం మ్యానిఫెస్టో ఏమిటి అంటూ, వైసిపీ అభ్యంతరం తెలిపింది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ, వ్యాఖ్యలు చేసింది. అయితే ఒక పక్క మంత్రులు, 90 శాతం, 95 శాతం పంచాయతీలు మావే అంటూ ప్రచారం చేసుకుంటూ, మరో పక్క టిడిపి బలపరిచిన అభ్యర్ధుల కోసం మ్యానిఫెస్టో విడుదల చేస్తే ఏమిటి అభ్యంతరం అంటూ, టిడిపి ఎదురు దాడి చేసింది. ఈ 20 నెలల్లో మీరు గ్రామాలకు ఏమి చేయలేదు కాబటి, మేము బలపరిచిన అభ్యర్దుల కోసం, ఇది చేస్తున్నాం అని చెప్తే తప్పు ఏమిటి అని ప్రశ్నించింది.

tdp 31012021 2

అయితే దీని పై తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది "రాజకీయ పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బలపరచే విషయంలోగానీ, మేనిఫెస్టో విడుదల చేసే విషయంలోగానీ ఎటువంటి ఆటంకం లేదన్న అంశాన్ని స్పష్టంగా ఏపీ పంచాయతీరాజ్ యాక్టు మరియు పీపుల్స్ రెప్రజెంటేషన్ యాక్టు సెక్షన్ 123 నందు పేర్కొన్న విషయాన్ని గుర్తించాలి" అంటూ టిడిపి అధికార ప్రతినిధి చెప్పారు. అయితే వైసీపీ దీని పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నోటిఫికేషన్ వచ్చిన తరువాత, మ్యానిఫెస్టో విడుదల చేయకూడదని తెలిపింది. టిడిపి మ్యానిఫెస్టో బయటకు వెళ్ళకుండా సీజ్ చేయాలని, అలాగే చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. దీని పై ఎస్ఈసి టిడిపికి నోటీస్ పంపించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజుకు, ఎస్ఈసి నోటీస్ పంపిస్తూ, దీని పై ఫిబ్రవరి 2 లోపు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఎస్ఈసి దీని పై విచారణ చేసి, తగు చర్యలు తీసుకుంటుందని తెలిపింది. మరి దీని పై టిడిపి ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read