కొద్ది సేపటి క్రితం, రాష్ట్ర మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ విశ్వభూషన్‌ హరిచందర్‌ కు లేఖ రాసారు. గవర్నర్ కు రాసిన లేఖలో, నిమ్మగడ్డ పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ప్రస్తుతం తనకు వ్యతిరేకంగా, ఏపి ప్రభుత్వం టెర్రర్ సృష్టిస్తుంది అని చెప్తూ, తన లేఖలో పేర్కొనటంతో పాటుగా, ఈ సమయంలో తమ జోక్యం ఎంతో అవసరం అంటూ గవర్నర్ ను కోరారు. హైదరాబాద్ ప్రశాంత నగర్ లో ఉన్న తన ఇంటి పై, 24 గంటల పాటు నిఘా విధించారని, ఏపి పోలీస్ విభాగానికి చెందిన ఒక ఫోర్ వీలర్ , అదే విధంగా రెండు మోటార్ సైకిల్స్ తనను నీడలా వెంటాడుతున్నాయని ఆ లేఖలో తెలిపారు. అలాగే తన ఫోన్ ని నిరంతరం, ట్యాప్ చేసి ఉంచుతున్నారని, ఆయన గవర్నర్ దృష్టి కి తీసుకువచ్చారు. తన ఫోన్ లు ట్యాప్ అవుతున్న విషయాన్ని, తాను నమ్ముతున్నాని పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది మార్చ్ 18వ తేదీన తనకు రక్షణ కల్పించాలని, కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని కూడా ఆయన గవర్నర్ కు చెప్పారు.

అయితే ఈ లేఖ పై కూడా విజయసాయి రెడ్డి, దర్యాప్తు చెయ్యాలి అంటూ , పోలీసులకు లేఖ రాయటం పై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. దీని పై దురుద్దేశం ఉందని ఆయన పేర్కొన్నారు, ఈ లేఖ ఫోర్జరీ అని చెప్పారని అన్నారు. అయితే ఈ లేఖ తానే రాసానని నేను చెప్పాను, లేఖ అందింది అని కేంద్రం చెప్పిన విషయాన్ని కూడా చెప్పారు. ఈ లేఖ ఆధారంగా కేంద్రం తనకు రక్షణ కూడా ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏపి సిఐడి అధికారులు, తన కార్యాలయం పై దాడి చేసి, అందులో ఒక హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారని, ఒక ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారని పేర్కొన్నారు. ఈ లేఖ బయట తయారు అయ్యింది అని చేస్తున్న ప్రచారం అవాస్తవం అని, గవర్నర్ కు తెలిపారు. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని, తాను భావిస్తున్నానని, తెలంగాణా పోలీసులను కూడా రక్షణ కల్పించాలని కోరానని, ఆయన గవర్నర్ కు తెలిపారు.

తాను విజయవాడకు రాకుండా, తన కార్యాలయానికి వెళ్ళకుండా, ఏపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, విజయవాడలో ఉన్న తన తల్లిని చూసేందుకు కూడా అడ్డుపడుతున్నారని లేఖలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యదర్శి, వాణి మోహన్, తన ఎంట్రీని అడ్డుకుంటున్నారని, ఎలాంటి సదుపాయాలు ఇవ్వటం లేదని, లేఖలో తెలిపారు. మే 29 న హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, అలాగే కనకరాజ్ నియామకం కోర్టు కొట్టేసినా, ఇప్పటికీ కనకరాజ్ కు అన్ని సదుపాయలు ఇవ్వటం పై కూడా, ఆయన అభ్యంతరం తెలిపారు. తన ఆఫీస్ కారుని కూడా, కనకరాజ్ కు ఇచ్చారని అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని నియమించే అధికారం ఉన్న మీరు, ఈ విషయాల పై జోక్యం చేసుకోవాలని, హైకోర్టు ఆదేశాలు అమలు అయ్యలా చూడాలని, తన వ్యక్తిగత భద్రత పై కూడా భరోసా ఇవ్వాలని, తన పై జరుగుతున్న కుట్రని అడ్డుకోవాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read